అధిక బరువు, హైబీపీని నియంత్రిస్తున్న చియా సీడ్స్

కోడి, మేక తదితర జంతు ఆధారిత మాంసం తర్వాత అత్యధిక ఆరోగ్య ప్రయోజనాలను అందించే పోషకాలు చియా సీడ్స్‌లో ఉన్నాయని ఆహార నిపుణులు చెప్తున్నారు.

Update: 2023-03-06 16:31 GMT
అధిక బరువు, హైబీపీని నియంత్రిస్తున్న చియా సీడ్స్
  • whatsapp icon

దిశ, ఫీచర్స్: కోడి, మేక తదితర జంతు ఆధారిత మాంసం తర్వాత అత్యధిక ఆరోగ్య ప్రయోజనాలను అందించే పోషకాలు చియా సీడ్స్‌లో ఉన్నాయని ఆహార నిపుణులు చెప్తున్నారు. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల హై కొలెస్ట్రాల్, హై బీపీ, బ్లడ్ షుగర్ సమస్యలు నియంత్రించబడతాయి. చికెన్, మేక మాంసం వంటి జంతు ఆధారిత ఆహారాలు ప్రతీ 100 గ్రాములకి 25 నుంచి 26 గ్రాముల ప్రొటీన్‌ను కలిగి ఉంటే.. చియా సీడ్స్‌లో ప్రతీ వంద గ్రాములకు 16 నుంచి 17 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి. అయితే చియా సీడ్స్ మొత్తం 10 ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి. అవి పూర్తి ప్రోటీన్ మూలంగా తయారవుతాయని న్యూట్రిషనిస్ట్‌లు చెప్తున్నారు.

శక్తినిచ్చే పోషకాహారంగా చియా సీడ్స్‌‌కు ప్రాధాన్యత ఉంది. కొందరు అవి జంతు ఆధారిత ఆహారాల కంటేను అధిక ప్రోటీన్‌లను అందిస్తాయని చెప్తుంటారు. కానీ, మాంసం కంటే అధిక ప్రోటీన్లు అందిస్తాయనడానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేవు. కాకపోతే మాంసం తర్వాత రెండవస్థానం మాత్రం చియా సీడ్స్‌దే. బరువు తగ్గడంలో, కొలెస్ట్రాల్ నియంత్రణలో.. ఎసిడిటీ సమస్యను తగ్గించడంలో గుడ్లు, మాంసం వంటి జంతు ఆహారం లాగే చియా సీడ్స్ దోహదం చేస్తాయి.


కణజాలాల ఆరోగ్యానికి

శరీర కణజాలాల నిర్మాణంలో, వాటిని కోల్పోయినప్పుడు తిరిగి పొందేందుకు అవసరమైన ప్రోటీన్లు చియా సీడ్స్‌లో ఉంటాయి. ఇందులో ఉండే ముఖ్యమైన అమైనో ఆమ్లాలు అర్జినైన్, లూసిన్, ఫెనిలాలనైన్, వాలైన్, లైసిన్ ఉంటాయి. డయాబెటిక్ ఎలుకలపై నిర్వహించిన ఒక అధ్యయనంలో చియా సీడ్ ప్రొటీన్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి.. వాపును, నొప్పిని తగ్గించడానికి దోహదం చేస్తుందని వెల్లడైంది. అంతేగాక చియా సీడ్స్‌లో ఉండే ఫ్యాట్ మరొక ముఖ్యమైన పోషకం. ఇది శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. కొన్ని విటమిన్లను గ్రహించడంలో సహాయపడుతుంది. గుడ్లలో, కోడి, మేక మాంసం కొవ్వులోనూ ఫ్యాట్ పుష్కలంగా ఉంటుంది. వీటిలో ప్రతీ 100 గ్రాములకి 14 నుంచి 22 గ్రాముల కొవ్వు ఉంటే.. చియా సీడ్స్‌లో 30 గ్రాముల కంటే కొంచెం ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది.

పుష్కలంగా మినరల్స్

చియా సీడ్స్‌లో మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జంతు ఆధారిత ఆహారాలకంటే అధికంగా (860–919 mg/100 గ్రా) ఫాస్పరస్‌ను కలిగి ఉంటాయి. కాల్షియం (456–631 mg/100 గ్రా), పొటాషియం (407–726 mg/100g), మెగ్నీషియం (335 –449 mg/100 g) అత్యధిక మొత్తంలో ఉంటాయి. జంతు ఆధారిత ఆహారాల్లో కూడా మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రధానంగా కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్ తక్కువ మొత్తంలో ఉంటాయి.


జీర్ణక్రియకు దోహదం

చియా సీడ్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు, జీవ క్రియకు మేలు చేస్తుంది. అధిక బరువు సమస్యను నివారిస్తుంది. ప్రతీ వంద గ్రాముల చియా సీడ్స్‌లో 34.4 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే అవిసె గింజలు, క్వినోవా, గుమ్మడి గింజలు, బాదం లోకంటే సీయా సీడ్స్‌లో అధిక పరిమాణంలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది.

ఇవి కూడా చదవండి : ఛీ.. ఛీ.. 23ఏళ్లుగా అదేపని.. టాయిలెట్ పేపర్ తింటూనే..

Tags:    

Similar News