నోట్లు ఉన్నప్పుడే బాగుండే.. ఫోన్ పే, గూగుల్ పే రావడంతో ఎక్కువైన ఖర్చులు

ప్రస్తుతం డిజిటల్ ఎరా నడుస్తుంది. లావాదేవీలు పూర్తిగా ఆన్ లైన్ ద్వారానే జరిగే రోజులు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే నాణేలు, నోట్లు కనబడటం గగనం అయిపోయింది. చిన్న చాక్లెట్ నుంచి లాప్ టాప్ వరకు..

Update: 2024-06-30 14:21 GMT

దిశ, ఫీచర్స్: ప్రస్తుతం డిజిటల్ ఎరా నడుస్తుంది. లావాదేవీలు పూర్తిగా ఆన్ లైన్ ద్వారానే జరిగే రోజులు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే నాణేలు, నోట్లు కనబడటం గగనం అయిపోయింది. చిన్న చాక్లెట్ నుంచి లాప్ టాప్ వరకు.. వంటింటి సామాన్ నుంచి టాయిలెట్ క్లీనర్ వరకు అన్నీ క్యాష్ లెస్ కొనుగోళ్లు ఉంటున్నాయి. దీంతో నగదు చెల్లింపుల, నగదు రహిత చెల్లింపుల మధ్య తేడా ఎలా ఉందో కనుగొనేందుకు చేసిన పరిశోధన దిమ్మతిరిగే వాస్తవాలను వెల్లడించింది.

ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే లాంటి క్యాష్ లెస్ సేవలు అందుబాటులోకి వచ్చాక జనం ఖర్చు ఎక్కువ పెడుతున్నారని తేల్చింది. నాణెం, నోట్లు చెల్లించి తీసుకునేటప్పుడు డబ్బులు చేతి ద్వారా వెళ్తున్నాయి కాబట్టి కొంచెం ముందు వెనుక ఆలోచించి నిర్ణయం తీసుకునేవారని తెలిపింది. ప్రస్తుతం స్టేటస్ అంటూ గొప్పలకు పోయి యాప్ ఓపెన్ చేసి ఉన్నవి లేనివి కొనేస్తున్నారని... అసలు పైసా అంటే వాల్యూ లేకుండా పోయిందని చెప్పింది. ఇలాంటి పనులు అప్పుల్లో కూరుకుపోయేలా చేస్తున్నాయని హెచ్చరించింది. అంతేకాదు టిప్స్, ఫండ్స్ అంటూ ఆన్లైన్ ఆర్డర్స్ కు డబ్బులు తగలబెడుతున్నారని వివరించింది. దీనికి బదులు నగదు చెల్లింపులు బెటర్ అని రూపాయి ఉన్న చోట మరో రూపాయి కూడా బెట్టే ప్రయత్నం జరిగేదని.. కానీ ఇప్పుడు మనీ కంట్రోల్ నేచర్ అస్సలు లేదని తెలిపింది.


Similar News