Arm Fat Reduce Exercises: ఆర్మ్ ఫ్యాట్‌తో స్టీవ్‌లెస్ డ్రెస్, శారీ ధరించలేకపోతున్నారా? ఎక్సర్‌సైజ్ ఎక్ఫర్ట్స్ చెప్పిన ఈజీ టిప్స్ మీ కోసం

చేతుల చుట్టూ కొవ్వు పేరుకుపోవడంతో చాలా మంది ఇబ్బందిపడిపోతుంటారు.

Update: 2024-07-21 16:10 GMT
Arm Fat Reduce Exercises: ఆర్మ్ ఫ్యాట్‌తో స్టీవ్‌లెస్ డ్రెస్, శారీ ధరించలేకపోతున్నారా? ఎక్సర్‌సైజ్ ఎక్ఫర్ట్స్ చెప్పిన ఈజీ టిప్స్ మీ కోసం
  • whatsapp icon

దిశ, ఫీచర్స్: చేతుల చుట్టూ కొవ్వు పేరుకుపోవడంతో చాలా మంది ఇబ్బందిపడిపోతుంటారు. దీంతో ఎంత అందమైన చీర కట్టుకున్నా.. స్లీవ్ లెస్ స్టైలీష్ డ్రెసెస్ వేసుకున్నా అమ్మాయిలు తెగ ఇబ్బందిపడిపోతుంటారు. డ్రెస్ వేసుకున్నాక చూడానికి కూడా అందహీనంగా కనిపిస్తారు. కాగా ఇంట్లోనే పలు వర్కౌట్స్ చేసి ఆర్మ్ ఫ్యాట్ తగ్గించుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. మరీ ఆ వర్కౌట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

కండరాలు కరిగించేందుకు 5 నుంచి 15 కేజీల వరకు ఉండే డంబెల్స్ తీసుకోని.. నిటారుగా నిల్చుని, మోకాళ్లను వంచి డంబెల్స్ ను షోల్డర్ వరకు తీసుకురావాలి. తర్వాత హ్యాండ్స్‌ను గట్టిగా హోల్డ్ చేయాలి. మూడు నిమిషానంతరం యథాస్థికి రావాలి. ఇలా ప్రతిరోజు ఓ ఐదు సార్లు చేస్తే కండరాల్లో పేరుకుపోయిన కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. అలాగే చెస్ట్ ప్రెస్ ఎక్సర్‌సైజ్ చేస్తే చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. మోకాళ్లను నిటారుగా ఉంచి బెంచ్ పైన పడుకొని డంబెల్స్‌ను కొంచెం దూరలో ఉండేలా పట్టుకొని చెస్ట్ వరకు వచ్చేలా హ్యాండ్స్ మూవ్ చేయాలి.

ఇలా చేస్తే కొవ్వు కరిగి నాజుగ్గా తయారవుతారు. అలాగే పుషప్స్ చేస్తే కొవ్వు చాలా తొందరగా కరిగిపోతుంది. ఆర్మ్ ఫ్యాట్ తగ్గించడంతో బెంచ్ డిప్ కూడా చాలా బాగా మేలు చేస్తుంది. ఇది బెంచ్ వెనకాల ఉండి, హ్యాండ్స్ బెంచ్ పై పెట్టి.. హ్యాండ్స్ ఒత్తిడి పెంచి బ్యాక్‌ను వెనక్కు ముందుకు కదిలించాలి. ఇలా చేస్తే కండరాలు స్ట్రాంగ్‌గా మారడంతో పాటు కొవ్వు ఈజీగా కరిపోయి.. చీర కట్టుకున్నా, స్లీవ్ లెస్ డ్రెస్ ధరించిన చాలా చక్కగా కనిపిస్తారు.

గమనిక: ఈ సమాచారం ఇంటర్‌నెట్ ద్వారా అందించడం జరిగింది. దిశ దీనిని ధృవీకరించలేదు.


Similar News