సెక్స్ తర్వాత నీళ్లు తాగవచ్చా..? సెక్సాలజిస్టులు ఏం చెప్పారంటే..?
శృంగారం అంటేనే మధురానుభూతి. ఈ రతి క్రీడలో మునిగి తేలడానికి ఎంతో మంది అర్రులు చాస్తుంటారు.
దిశ, వెబ్‌డెస్క్ : శృంగారం అంటేనే మధురానుభూతి. ఈ రతి క్రీడలో మునిగి తేలడానికి ఎంతో మంది అర్రులు చాస్తుంటారు. యువ జంటలు మొదలుకుని వృద్ధుల వరకు దానిని ఆస్వాదించడానికి ఉత్సాహం చూపిస్తారు. అయితే శృంగారానికి ముందు.. ఆ తర్వాత ఏం చేయాలనే దానికి చాలా మందికి అవగాహన ఉండటం లేదని సెక్సాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకూ భాగస్వాములు ఎలాంటి తప్పిదాలు చేస్తున్నారో చూద్దాం..
శృంగార సమయం పురుషుడి సామర్ధ్యంపై ఆధారపడి ఉంటుంది. కొందరు రెండు, మూడు నిమిషాల్లోనే ముగిస్తుండగా.. మరికొందరు ఫోర్ ప్లే ద్వారా అర గంట వరకు సెక్స్‌లో పాల్గొంటుంటారు. అయితే శృంగారం ఎంత సేపు చేసినా.. ఆ సమయంలో వారి శరీరం వేడి ఎక్కుతుంది. సెక్స్ ముగిసిన వెంటనే బాడీలో హీట్ తగ్గదు. ఆ వేడి తగ్గాలంటే కనీసం అరగంటకు పైగా పడుతుంది. అయితే కొందరు సెక్స్ ముగిసిన వెంటనే అలసట తగ్గించుకోవడానికి నీళ్లు తాగుతుంటారు. అలా తాగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
సెక్స్‌తో వేడెక్కిన శరీరం.. నీళ్లు తాగడంతో చల్లబడుతుంది. దీనివల్ల పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు శరీరం శక్తిని కోల్పోతుందట. మళ్లీ శృంగారంలో పాల్గొనాలన్న ఇంట్రెస్ట్ సైతం నశిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. అయితే సెక్స్ అనంతరం దాహం వేయడం, ఆకలి కావడం మంచిదేనని చెబుతున్నారు. అలా అనిపిస్తే శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా పని చేస్తున్నాయని గుర్తించాలట. సెక్స్‌కు ముందు ఎంత వాటరైనా తాగొచ్చు అంటున్నారు. శృంగారం తర్వాత ఆకలి వేస్తే అన్నం తినకుండా బాదంపాటు, బిస్కెట్లు, పండ్ల రసాలు తాగితే మంచిదని వైద్యులు వివరిస్తున్నారు.