Lemon Water: ఆ సమస్యలు ఉన్నవారు లెమన్ వాటర్ తాగొచ్చా .. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
విటమిన్ సి ఉన్న నిమ్మరసాన్ని( Lemon Water) ఎక్కువగా తాగుతుంటారు.
దిశ, వెబ్ డెస్క్ : మనలో చాలా మంది ఉదయాన్నే వ్యాయామం చేసి ఏదొక జ్యూస్ తీసుకుంటూ ఉంటారు. వాటిలో విటమిన్ సి ఉన్న నిమ్మరసాన్ని( Lemon Water) ఎక్కువగా తాగుతుంటారు. కానీ, ఇది కొందరికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అయితే, లెమన్ వాటర్ ఎవరు తీసుకోకూడదో ఇక్కడ తెలుసుకుందాం..
పరగడుపున నిమ్మ రసాన్ని తీసుకోవడం వలన కాలేయం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్యలు ఉన్నవారు తీసుకోకపోవడమే మంచిది. లెమన్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు రోజూ వారీ డైట్ లో లెమన్ వాటర్ని చేర్చుకోండి.
ఎసిడిటీ ( Acidity), గ్యాస్ట్రిక్ , దంత సమస్యలు ఉన్న వారు కూడా పరగడుపున నిమ్మరసం తీసుకోకూడదు. ఎందుకంటే, సిట్రిక్ యాసిడ్ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఇది దంతాల ఎనామిల్‌ను దెబ్బతీస్తుంది. అలాగే, కిడ్నీ సమస్యలు ఉన్నవారు దీనిని తీసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘దిశ’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు