బ్రెయిన్, ఫ్యాట్ మాట్లాడుకుంటాయ్ : Scientist

దిశ, ఫీచర్స్ : మానవ శరీర నిర్మాణంలోని ప్రత్యేకతలు, అవయవాల మధ్య సమన్వయం చూస్తే ఆశ్చర్యపడక తప్పదు.

Update: 2022-09-02 10:37 GMT

దిశ, ఫీచర్స్ : మానవ శరీర నిర్మాణంలోని ప్రత్యేకతలు, అవయవాల మధ్య సమన్వయం చూస్తే ఆశ్చర్యపడక తప్పదు. ఇక పెరిగిన శాస్త్ర సాంకేతికత, వైద్యరంగంలో పుట్టుకొచ్చిన విప్లవాత్మక మార్పులు హ్యూమన్ బాడీ పనితీరును సవివరంగా ఆవిష్కరిస్తున్నాయి. ఇదే క్రమంలో తాజా అధ్యయనమొకటి కొవ్వు, మెదడు మధ్య కొత్త సంబంధాన్ని ప్రదర్శించింది. ఫ్యాట్ బర్నింగ్‌ను క్రమబద్దీకరించడంలో మెదడు.. రక్తంలోని హార్మోనల్ సిగ్నల్స్‌కు ప్రతిస్పందించదు. కానీ నేరుగా కొవ్వు కణజాలానికి సందేశాలను పంపడం ద్వారా జీవక్రియ ప్రక్రియలను ప్రభావితం చేయగలదని ఈ అధ్యయనం వెల్లడించింది.

'మెదడు.. కొవ్వు గురించి సందేశాలను నిష్క్రియాత్మకంగా స్వీకరించకుండా చురుగ్గా సర్వే చేస్తుందని ఈ న్యూరాన్ల ఆవిష్కరణ మొట్టమొదటిసారిగా సూచిస్తోంది' అని స్క్రిప్స్ రీసెర్చ్‌లో అసోసియేట్ ప్రొఫెసర్, కో-సీనియర్ రచయిత లి యే చెప్పారు. నిజానికి అధ్యయనానికి ముందు కొవ్వు కణజాలం సింపథెటిక్ నాడీ వ్యవస్థ ద్వారా అనుసంధానించబడిందని శాస్త్రీయ ప్రపంచం భావించింది. అయితే ఈ ఫలితాలు పొందేందుకు పరిశోధనా బృందం పూర్తిగా సరికొత్త ఇమేజింగ్ పద్ధతులను సృష్టించాల్సి వచ్చింది.

యే, అతని సహచరులు ఈ అధ్యయనాన్ని వివరించేందుకు రెండు నావెల్ మెథడ్స్ ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. వీరి బృందం మొదట ఎలుక కణజాలాలను పారదర్శకంగా చేసేందుకు HYBRiD అనే ఇమేజింగ్ టెక్నిక్‌ను ఉపయోగించింది. కొవ్వు కణజాలంలోకి ప్రవేశించినప్పుడు న్యూరాన్ల మార్గాలను ట్రాక్ చేసేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఈ న్యూరాన్లలో దాదాపు సగం డోర్సల్ రూట్ గాంగ్లియాకు బదులు సింపథెటిక్ నెర్వస్ సిస్టమ్‌కు కనెక్ట్ కాలేదని పరిశోధకులు కనుగొన్నారు. ఇక్కడే అన్ని ఇంద్రియ న్యూరాన్లు మెదడులో ఉద్భవించాయి. ఇక కొవ్వు కణజాలంలో ఈ న్యూరాన్ల పనితీరును మరింత క్షుణ్ణంగా పరిశోధించేందుకు 'ఆర్గాన్ ట్రేసింగ్ కోసం ఆప్టిమైజ్ చేయబడిన రెట్రోగ్రేడ్ వెక్టర్' కోసం రూట్ అని పిలిచే రెండో సాంకేతికతను ఉపయోగించారు.

Also Read :మీ అరచేతిలో రాహురేఖ ఇలా ఉంటే.. ఏం జరుగుతుందో తెలుసా?  

Tags:    

Similar News