BP control Tips: మెడిసిన్ వాడకుండానే బీపీ కంట్రోల్.. ఈ టిప్స్ పాటిస్తే చాలు!

ఇటీవల చాలా మంది బ్లడ్ ప్రెజర్ లేదా హైబీపీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తున్నట్లు నిపుణులు చెప్తున్నారు. పెద్దలతో పాటు యువతలోనూ ఈ సమస్య పెరిగిపోతోంది.

Update: 2024-08-15 09:10 GMT

దిశ, ఫీచర్స్ : ఇటీవల చాలా మంది బ్లడ్ ప్రెజర్ లేదా హైబీపీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తున్నట్లు నిపుణులు చెప్తున్నారు. పెద్దలతో పాటు యువతలోనూ ఈ సమస్య పెరిగిపోతోంది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు కూడా ఇందుకు కారణం అవుతున్నాయి. అయితే అధిక రక్తపోటును కంట్రోల్లో ఉంచుకునేందుకు కొందరు రెగ్యులర్‌గా మెడిసిన్ వాడుతుంటారు. కొన్నిసార్లు వీటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంటాయి. అలాంటి పరిస్థితికి చెక్ పెట్టేలా మెడిసిన్ వాడకుండానే బీపీని కంట్రోల్లో ఉంచుకునే మార్గాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఉప్పును లిమిట్‌గా వాడండి

ఉప్పు ఆరోగ్యానికి అవసరం. అది లేకపోతే రుచి కూడా ఉండదు. కానీ పరిమితికి మించి వాడితే మాత్రం బెడిసి కొడుతుంది అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొంటున్నవారు ఆహారంలో భాగంగా తక్కువగా తినాలని సూచిస్తున్నారు. సాధారణ వంటకాల్లో వాడటంవల్ల ఎటువంటి పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు కానీ ఇటీవల జంక్ ఫుడ్స్‌ తినే అలవాట్లు పెరగడం, వాటిలో మోతాదుకు మించి ఉప్పు వాడటం వంటివి హైబీపీ సమస్యకు దారితీస్తున్నట్లు ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. అందుకే ఉప్పును తక్కువగా వాడాలని, దీనివల్ల అధిక రక్తపోటును కంట్రోల్లో ఉంచుకోవచ్చునని సూచిస్తున్నారు. అలాగే చక్కెర కూడా లిమిట్‌గా వాడాలి.

అధిక పొటాషియం

తీసుకునే ఆహారంలో పోషకాలు లోపించడం, ముఖ్యంగా శరీరానికి తగినంతగా పొటాషియం అందకపోవడంవల్ల కూడా అధిక రక్తపోటు సమస్య వస్తుంది. రాకుండా ఉండాలంటే పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, తృణ ధాన్యాలు, పాలకూర, బచ్చలికూర, బఠానీలు, అరటిపండ్లు వంటివి కనీసం అప్పుడప్పుడూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వీటిలోని అధిక పొటాషియం బీపీని అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.

బరువు నియంత్రణ - వ్యాయామాలు

అధిక బరువు పెరగడానికి కారణాలు ఏమైనా దానివల్ల మధుమేహం, అధిక రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవాకాశం ఉంది. వాటిని అదుపులో ఉంచుకోవాలంటే ముందుగా ఓవర్ వెయిట్‌ ప్రాబ్లం నుంచి బయటపడాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రన్నింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వివిధ రెగ్యులర్ వ్యాయామాలు అధిక బరువు నియంత్రణలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి.

స్మోకింగ్ - డ్రింకింగ్

ధూమపానం, మద్యపానం అలవాట్లు క్రమంగా అధికరక్తపోటు సమస్యకు దారితీస్తాయని నిపుణులు చెప్తున్నారు. పైగా అవి ఊపిరితిత్తులపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఆల్కహాలిక్ లివర్ డిసీజెస్ కూడా వచ్చే చాన్స్ ఉంటుంది. స్మోకింగ్‌ సందర్భంగా పొగాకులో ఉండే నికోటిన్ ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. ఇది అధక రక్తపోటును మరింత పెంచుతుందని నిపుణులు అంటున్నారు.

స్ట్రెస్ అండ్ జంక్ ఫుడ్స్

అధిక ఒత్తిడి, తరచుగా జంక్ ఫుడ్ తినే అలవాట్లు కూడా హైబీపీకి కారణం అవుతాయి. ఇవి గుండె పనితీరును కూడా ప్రభావితం చేస్తాయని నిపుణులు చెప్తున్నారు. మానసిక ఒత్తిడికి గురి అయినప్పుడు కార్టిసాల్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది బీపీ పెరిగేందుకు ప్రేరణగా నిలుస్తుంది. అలాగే అధిక ఉప్పు, అధిక కారం, అధికంగా బాయిల్ చేయడం, ప్యాకేజింగ్‌లలో రసాయనాలు వినియోగించడం వంటి కారణాలవల్ల జంక్ ఫుడ్స్ కూడా రక్తపోటును పెంచుతాయి. కాబట్టి వీటన్నింటికీ దూరంగా ఉండటం బెటర్ అంటున్నారు నిపుణులు.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించగలరు.

Tags:    

Similar News