బ్లడ్ పాయిజన్ ఇష్యూస్.. 40% మందిలో కెరీర్‌పై నెగెటివ్ ఇంపాక్ట్
హెల్త్ ఇష్యూస్‌వల్ల కేవలం ఆరోగ్యపరంగానే కాదు, ఫ్యామిలీ, వర్క్ అండ్ కెరీర్, ఎంప్లాయిమెంట్ పరంగానూ కుటుంబం, వృత్తిపరమైన ఇబ్బందులు కూడా తలెత్తుతుంటాయి.
దిశ, ఫీచర్స్ : హెల్త్ ఇష్యూస్‌వల్ల కేవలం ఆరోగ్యపరంగానే కాదు, ఫ్యామిలీ, వర్క్ అండ్ కెరీర్, ఎంప్లాయిమెంట్ పరంగా కూడా ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ప్రజెంట్ బ్లడ్ పాయిజనింగ్ లేదా సెప్సిస్ సమస్య కూడా అలాంటి ఎఫెక్టునే చూపుతోంది. దీనవల్ల వరల్డ్‌వైడ్‌గా 40 శాతం మంది ఎంప్లాయీస్ తమ ఉద్యోగాలను, చేస్తున్న ఇతర పనులను కోల్పోవాల్సి వస్తోందని నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (NTNU)కి చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా సెప్సిస్ బాధితులు రెండేండ్ల తర్వాత తాము చేస్తున్న ఉద్యోగాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేస్తున్నారట. వాస్తవానికి సెప్సిస్ లేదా తీవ్రమైన బ్లడ్ ఇన్ఫెక్షన్ అనేది ఇమ్యూనోలాజికల్ ఓవర్ రియాక్షన్‌గా పరిశోధకులు పేర్కొంటున్నారు. ఇది ఆర్గాన్ ఫెయిల్యూర్‌కు దారితీస్తుందని చెప్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఐదు మరణాలలో ఒకటికి బ్లడ్ పాయిజన్ వల్లనే సంభవిస్తున్నాయి.
అధ్యయనంలో భాగంగా నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన రీసెర్చర్ నినా విబెచే స్కీ ఆధ్వర్యంలోని బృందం 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల36 వేలమంది సెప్సిస్ పేషెంట్లను పరిశీలించింది. తమ పరిశోధనలకోసం ఈ బృందంలోని సైంటిస్టులు నార్వేజియన్ పేషెంట్ రిజిస్ట్రీ అండ్ నార్వేజియన్ లేబర్ అండ్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా డేటాను సేకరించి ఎనలైజ్ చేశారు. అలాగే బాధితుల్లో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన ఆరు నెలలు, ఒక సంవత్సరం, అలాగే రెండు సంవత్సరాలల్లో ఎంతమంది చొప్పున తమ వర్క్ అండ్ ప్రొఫెషనల్, అందర్ యాక్టివిటీస్‌లో పాల్గొన్నారనేది విశ్లేషించారు. దీని ప్రకారం.. డిశ్చార్జ్ అయిన ఆరు నెలల తర్వాత 59 శాతం మంది తమ పనికి తిరిగి వచ్చారు. ఒక సంవత్సరం తర్వాత 67 శాతానికి పైగా తిరిగి వచ్చారు. అయితే రెండేండ్ల తర్వాత మాత్రం బ్లడ్ పాయిజన్ బాధితులు తమ పనికి లేదా ఉద్యోగాలకు రావడం అనేది 63 శాతానికి పడిపోయింది. అంటే సెప్సిస్ బాధితుల్లో దాదాపు 40 శాతం మంది రెండేండ్ల తర్వాత పనిచేసే సామర్థ్యాన్ని కోల్పోతున్నారు. కాబట్టి ఉద్యోగాలకు రావడం లేదు. మరొక నివేదిక ప్రకారం వర్క్ లేదా ఉద్యోగాలు చేసే సెప్సిస్ బాధితులు 2016లో 70 శాతం పనిలో ఉండగా, 2019లో మాత్రం అది 57 శాతానికి పడిపోయింది. పైగా రెండేండ్ల తర్వాత చాలామంది దీర్ఘకాలిక అనారోగ్యాలను ఎదుర్కొంటున్నారు. క్రమంగా వీరిలో జీవన నాణ్యత కూడా క్షీణిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు.