చక్కెర తింటే ఇన్ని నష్టాలున్నాయా?

ప్రతిరోజూ చక్కెర వినియోగం అలవాటు అయిపోయింది. ముఖ్యంగా టీ, కాఫీతో కలిపి కచ్చితంగా ఉదయం, సాయంత్రం తీసుకుంటాం. కానీ షుగర్ అధిక మోతాదులో

Update: 2024-06-26 15:02 GMT

దిశ, ఫీచర్స్: ప్రతిరోజూ చక్కెర వినియోగం అలవాటు అయిపోయింది. ముఖ్యంగా టీ, కాఫీతో కలిపి కచ్చితంగా ఉదయం, సాయంత్రం తీసుకుంటాం. కానీ షుగర్ అధిక మోతాదులో తీసుకోవడం వల్ల హెల్త్ పై నెగెటివ్ ఎఫెక్ట్ పడుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. దీన్ని డెయిలీ డైట్ లో చేర్చకపోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పిస్తున్నారు.


* అధిక పంచదార వినియోగం బలహీనమైన మెదడు పనితీరుతో సంబంధం కలిగి ఉంది. అభిజ్ఞా సామర్థ్యంపై ఎఫెక్ట్ చూపుతుంది. కాబట్టి షుగర్ ఆహారంలో చేర్చకుండా ఉంటే జ్ఞాపకశక్తిపై ప్రతికూల ప్రభావం ఉండదని.. మెమొరీ పెరుగుతుందని చెప్తున్నారు.

* చక్కెర.. రక్తంలో షుగర్ లెవెల్స్ హెచ్చుతగ్గులకు కారణం అవుతుంది. మానసిక కల్లోలం, చిరాకుకు దారితీస్తుంది. కాబట్టి దూరంగా ఉండటమే మంచిది.

* షుగర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం టైప్ 2 డయాబెటిస్ ప్రమాదంతో సంబంధం కలిగి వుంది. ఇది చాలా రిస్క్ తో కూడిన పరిస్థితి.

* చక్కెర నిద్రా విధానాలకు ఆటంకం కలిగిస్తుంది. బెటర్ స్లీప్ సైకిల్ ను దూరం చేస్తుంది. దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు నిపుణులు.

* చక్కెర తీసుకోవడాన్ని తగ్గించడం ద్వారా దంతాలు, చిగుళ్ళను కాపాడుకోవచ్చు. తద్వారా ఆరోగ్యకరమైన పళ్లు.. ప్రకాశవంతమైన చిరునవ్వు మీ సొంతం అవుతుంది.

* ఇక చక్కెర వినియోగం చర్మంపై కూడా ఎఫెక్ట్ చూపుతుంది. మొటిమలు, అకాల వృద్ధాప్యం, ముఖం వాపు వంటి సమస్యలతో ముడిపడి ఉంది. మొత్తానికి సంపూర్ణ ఆరోగ్యానికి చక్కెరను వదిలేయడమే కరెక్ట్ అంటున్నారు ఎక్స్ పర్ట్స్.

Similar News