BARRELAKKA: 'నేను ఏ తప్పు చేయలేదు.. అతనెవరో నాకు తెలీదంటూ' బోరున ఏడుస్తున్న బర్రెలక్క..(వీడియో)

సోషల్ మీడియా ద్వారా పలు వీడియోలు రీల్స్ చేసి ఎంతో మంది సెలబ్రిటీలుగా మారిపోయారు. అలా ఫేమస్ అయిన వారిలో బర్రెలక్క అలియాస్ శిరీష కూడా ఒకరు.

Update: 2024-08-22 09:38 GMT

దిశ, ఫీచర్స్: సోషల్ మీడియా ద్వారా పలు వీడియోలు రీల్స్ చేసి ఎంతో మంది సెలబ్రిటీలుగా మారిపోయారు. అలా ఫేమస్ అయిన వారిలో బర్రెలక్క అలియాస్ శిరీష కూడా ఒకరు. ఆమె ఎన్ని చదువులు చదివినా కానీ చివరికి గవర్నమెంట్ ఉద్యోగాలు రావు అందుకే బర్రెలు కాయడమే అనే వీడియోతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఈ వీడియో క్షణాల్లో వైరల్ కావడంతో బర్రెలక్క ఓవర్ నైట్ స్టార్‌గా మారిందని చెప్పడంలో ఏమాత్రం అతియోశక్తి లేదు. అలాగే గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజక వర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బర్రెలక్క పోటీ చేసింది. దీంతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. కానీ, విజయం మాత్రం సాధించలేక పోయింది. అలాగే ఎంపీ పోటిల్లో కూడా పాల్గొని మరోసారి ఓటమిని చవిచూసింది.

ఇదిలా ఉంటే.. బర్రెలక్క(శిరీష) మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి ఎలక్షన్లలో నిలబడో.. పెళ్లి చేసుకుంటూనో కాదు.. ఫేస్ బుక్‌లో చాట్ చేసి డబ్బులు వసూలు చేసిందంటూ వైరల్ అవుతున్న వార్తతో. అది కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కాదండోయ్.. కర్ణాకటలో. ఓ ప్రముఖ కన్నడ ఛానెల్‌లో వచ్చిన వార్తను చూసిన బర్రెలక్క బోరు బోరున విలపిస్తూ ఓ వీడియో విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే.. తాజాగా బర్రెలక్క తన ఇన్‌స్టా గ్రామ్ వేదికగా ఓ వీడియో షేర్ చేసింది. అందులో వెక్కి వెక్కి ఏడుస్తూ.. నాకు ఏ పాపం తెలియదు.. ఆ వ్యక్తికి నాకు ఎలాంటి సంబంధం లేదు.. అంటూ కన్నీరు పెట్టుకుంది. ఇంతకు బర్రెలక్క ఎందుకు ఇంతలా ఆవేదన వ్యక్తం చేస్తుందంటే.. తాజాగా కన్నడకు చెందిన ఓ ప్రముఖ ఛానెల్‌.. బర్రెలక్క.. తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ద్వారా.. ఎవరో ఒక వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని.. మోసం చేసిందంటూ వార్తలను ప్రచారం చేసింది. ఈ న్యూస్‌లో తన ఫొటోలతో పాటు, పేరు కూడా ప్రస్తావించింది సదరు ఛానెల్‌. పైగా బాధితుడు కూడా తనను బర్రెలక్క మోసం చేసిందని చెప్పడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ న్యూస్‌ బర్రెలక్క దృష్టికి వచ్చింది. దీనిపై స్పందిస్తూ.. ఇవన్నీ అవాస్తవం అని.. ఆ వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. తాను ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకో లేదని చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఇన్‌స్టాలో ఓ వీడియోని షేర్‌ చేసింది.

''ఇప్పుడే ఓ న్యూస్‌ చూశాను. ఇది ఏ ఛానలో కూడా నాకు తెలియదు. ఏదో కన్నడ ఛానల్‌ అని తెలుస్తుంది. ఇలాంటి ఫేక్‌ న్యూస్‌ ఎందుకు స్ప్రెడ్‌ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఫేస్‌బుక్‌లో చాట్‌ చేసి డబ్బులు దోచుకుందని వార్తలు వేస్తున్నారు. అసలేం జరుగుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. వాడెవడో ముసలోడు.. తనెవరో కూడా నాకు తెలియదు. ఎందుకిలా నా మీద బ్యాడ్‌ న్యూస్‌ ప్రచారం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. పెళ్లి చేసుకుని నా బతుకేదో నేను బతుకుతున్నాను. కానీ కొందరు కావాలనే నా జీవితంతో ఆడుకుంటున్నారు'' అని ఆవేదన వ్యక్తం చేసింది.

''నా పేరు మీద ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో చాలా ఫేక్‌ అకౌంట్స్‌ ఉన్నాయి. అందులో ఎవరు ఇలాంటి పని చేశారో నాకు తెలియదు. నేనేం తప్పు చేయలేదు.. అనవసరంగా నన్ను బ్లేమ్‌ చేయకండి.. ప్లీజ్‌'' అంటూ బోరున విలపిస్తూ.. వీడియో విడుదల చేసింది. ఇది చూసిన ఆమె అభిమానులు మీరు కంగారు పడకండి.. ఈమధ్య కాలంలో ఇలాంటి మోసాలు విపరీతంగా పెరిగాయి. పోలీసులకు కంప్లైట్‌ ఇ‍వ్వండి అంటూ ఆమెకు ధైర్యం చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

(video link credits to barrelakka siri instagram id)






 


 


 

Tags:    

Similar News