అవకాడో నూనెతో ఆ సమస్యలను తగ్గించుకోవచ్చు!
అవకాడోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని మనందరికి తెలుసు.
దిశ, ఫీచర్స్: అవకాడోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని మనందరికి తెలుసు. దీన్ని బ్రేక్ ఫాస్ట్, లంచ్ లో కానీ డిన్నర్లో లో కానీ తీసుకోవడం మంచిది. అయితే అవకాడో ఆయిల్‌లో ఎన్నో అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవోకాడో నూనెను సాధారణంగా పండు యొక్క గుజ్జు నుండి తయారు చేస్తారు. ఈ నూనెతో మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలున్నాయని ఉన్నాయి. దీనిలో అవసరమైన కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు A, D, E ,గుండె ఆరోగ్యాన్ని కాపాడే ఫైటోస్టెరల్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
1. అధిక బరువు
దీనిలో ఉండే మోనోసాచురేటెడ్ కొవ్వులు బరువు నియంత్రణను సులభతరం చేస్తాయి. మనం ఆహారంలో అవకాడో నూనెను చేర్చుకోవడం వల్ల మన పొట్ట నిండిన అనుభూతి కలుగుతుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా మెరుగుపరుస్తుంది, ఇది మెరుగైన బ్లడ్ షుగర్ నియంత్రణకు దారితీస్తుంది.
2. చర్మ ఆరోగ్యం
అవకాడో నూనెలో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది. ఫ్రీ రాడికల్స్ సమస్య తగ్గి చర్మం మెరుస్తుంది. ఈ నూనెలో మాయిశ్చరైజింగ్ గుణాలు ఉన్నాయి. వాటిని చర్మ సంరక్షణ ప్రొడక్ట్స్ లో ఉపయోగిస్తారు.
3. కంటి ఆరోగ్యం
అవకాడో నూనెలో లుటిన్, జియాంథైన్ అనే రెండు యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి, ఇవి కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇవి వయస్సుతో పాటు వచ్చే కంటి సమస్యలను తగ్గిస్తాయి.
4. గుండె ఆరోగ్యం
అవకాడోలో మోనోశాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఓలిక్ యాసిడ్ కూడా ఉంటుంది, ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే గుండెపోటు కూడా రాకుండా చేస్తుంది.
Read More..