గెస్టులను ఇంప్రెస్ చేయాలా?.. 59% మంది చేస్తున్న పనేంటో తెలుసా?
మీకు తెలుసా? ప్రపంచంలోని ఎక్కువ దేశాల్లో సగటు వ్యక్తులు బంధువులు వచ్చినప్పుడు వారిని ఇంప్రెస్ చేయడానికి మాత్రమే ఇంట్లో కొన్ని వస్తువులను, అలంకారాలను కలిగి ఉంటున్నట్లు ఎల్ జిమాడోర్ కోసం వన్‌పోల్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
దిశ, ఫీచర్స్ : మీకు తెలుసా? ప్రపంచంలోని ఎక్కువ దేశాల్లో సగటు వ్యక్తులు బంధువులు వచ్చినప్పుడు వారిని ఇంప్రెస్ చేయడానికి మాత్రమే ఇంట్లో కొన్ని వస్తువులను, అలంకారాలను కలిగి ఉంటున్నట్లు ఎల్ జిమాడోర్ కోసం వన్‌పోల్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఇందులో భాగంగా నిపుణులు 21 ఏండ్లు పైబడిన 2,000 అడల్ట్స్‌ను ప్రశ్నించారు. ఈ సందర్భంగా గెస్టులు వచ్చినప్పుడు వారిని ఇంప్రెస్ చేయడానికి, వారు తమ ఇంటిని ‘ఫ్యాన్సీ’గా భావించడానికి ప్రయత్నిస్తామని పలువురు పేర్కొన్నారు. 46 శాతం మంది తమ ఇంటిలోని ఫ్లోరింగ్ అట్రాక్టివ్‌గా, నీట్‌గా ఉంచుకోవడం ద్వారా గెస్టులను ఇంప్రెస్ చేయాలని భావిస్తున్నారు. ఇక పెద్ద పెద్ద కిటికీలు కూడా అట్రాక్టివ్‌గా ఉంటాయని 42 శాతం మంది చెప్తున్నారు. మరో 54 శాతం మంది ఫర్నీచర్, 45 శాతం మంది యునిక్ వాల్ ఆర్ట్ వంటివి బంధువులను ఇంప్రెస్ చేయడంలో ప్రముఖంగా ఉంటాయని అభిప్రాయపడుతున్నారు.
మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు వారిని ఆకట్టుకునే విషయంలో ఇంటిలో స్పెషల్ హోం బార్‌ను ఏర్పాటు చేసుకుంట్టున్నట్లు సర్వేలో వెల్లడైంది. అమెరికా సహా పలు ఫారెన్ కంట్రీస్‌లో హోం బార్ అనేది మోస్ట్ అట్రాక్టివ్ ఇంప్రెషన్‌గా ఉంటోంది. లాంగ్ వుడెన్ సర్‌ఫేస్‌గా ఉండే ప్రదేశంలో వివిధ పానీయాలు, బాటిల్స్ ఉంచడంతో ఇంటికి వచ్చిన గెస్టులు ఇంప్రెస్ అవుతారని పలువురు పేర్కొంటున్నారు. అంతేకాదు అమెరికన్లలో హోమ్ బార్ లేని వారు తరచుగా FOMO అనే రుగ్మతను కూడా అనుభవిస్తున్నారట. ఇక ఇతరుల ఇష్టంతో సంబంధం లేకుండా 59 శాతం మంది హోమ్ బార్‌ను సొంత ఆలోచనకు అనుగుణంగా డిజైన్ చేయించుకుంటున్నారు. 36 శాతం మంది మాత్రం ఇతరులను ఆకట్టుకునే ఆలోచనతో మాత్రమే హోం బార్ ఏర్పాటు చేస్తున్నారు. హోం బార్‌లో ఎటువంటి వస్తువులను ఇష్టపడతారని ప్రశ్నించగా 61 శాతం మంది షాట్ గ్లాసెస్ అట్రాక్టివ్‌గా ఉంటాయని, 50 శాతం మంది ఓపెనర్లు ఆకట్టుకుంటాయని, 42 శాతం మంది ఐస్ బకెట్ లేదా స్కూప్స్ ఆకట్టుకుంటాయని వెల్లడించారు. కాక్‌టెయిల్ షేకర్ ఇంప్రెసివ్‌గా ఉంటుందని 38 శాతం మంది, డ్రింక్ మిక్సర్ ఇతరులను ఇంప్రెస్ చేస్తుందని 29 శాతం మంది పేర్కొన్నారు.