సూర్యునిపై భారీ సుడిగాలి!.. సోలార్ టెలిస్కోప్ ద్వారా పరిశీలించిన ఖగోళ శాస్త్రవేత్తలు

ఎన్ని పరిశోధనలు జరిగినా, ఎంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా సౌర వ్యవస్థలో బయట పడని అద్భుతాలు ఇంకా అనేకం ఉన్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తుంటారు.

Update: 2023-03-22 12:17 GMT

దిశ, ఫీచర్స్: ఎన్ని పరిశోధనలు జరిగినా, ఎంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా సౌర వ్యవస్థలో బయట పడని అద్భుతాలు ఇంకా అనేకం ఉన్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తుంటారు. తాజాగా భూమి పరిమాణంలో ఉన్న బ్లబ్స్(blobs), సుడిగాలి వంటి భయంకరమైన వాతావరణం మధ్య సూర్యునిపైకి దూసుకెళ్లటం ఖగోళ శాస్త్రవేత్తలను విస్మయానికి గురి చేస్తోంది.

అత్యంత వేడిగల సలసల మరిగే ప్లాస్మా (hot boiling plasma) ఆకాశంలోకి సుడులు తిరిగుతూ దూసుకెళ్తుంటే ఎలా ఉంటుందో మీరొకసారి హించుకోండి. అచ్చం అలాగే సూర్యుడిపైకి 14 భూ పరిమాణాలతో సమానమైన సైజులో వేడి ప్లాస్మాతో కూడిన బ్లూబ్స్ వెళ్లి.. తిరిగి వెనక్కి వచ్చిన పరిస్థితి సూర్యుడిపై జరగడం ఖగోళ శాస్త్రవేత్తలను, ఖగోళ ఫోటోగ్రాఫర్లను విస్మయానికి గురిచేసింది.

మేఘంలో కూలిపోయిన బ్లబ్స్

సౌర వ్యవస్థలో అత్యంత ఎత్తైన సుడిగాలి ఫొటోలను నాసా సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ ద్వారా తీసింది. అసలు విషయం ఏంటంటే సౌర సుడిగాలి సూర్యుని ఉత్తర ధ్రువంలో సంభవించింది. ఇది మూడు రోజులుగా కొనసాగి చివరికి సూర్యుడిపై 120,000 కిలోమీటర్ల ఎత్తు వరకు పెరిగింది. తర్వాత ఈ సుడిగాలితోపాటు వేడి ప్లాస్మాతో కూడిన బ్లబ్స్ అది అయస్కాంతీకరించబడి మేఘంలో కూలిపోయాయి.

‘‘మార్చి 21న నేను 3 గంటలపాటు సోలార్ టెలిస్కోప్ ద్వారా సూర్యుడిపై ఉన్న పొడవైన బ్లబ్స్ అండ్ సుడిగాలి(tornado)వైపు చూస్తున్నాను. ఈ సందర్భంగా14 భూ గ్రహాల పరిమాణంతో పోల్చదగిన ఎత్తైన స్విర్లింగ్ కాలమ్ ప్లాస్మాను(14-Earths-tall swirling column of plasma), సూర్యునిపై ప్రకాశించే పదార్థాన్ని చూశాను. అంతకంటే భయంకరమైన సన్నివేశం ఇంకెక్కడా ఉండదేమో అనిపించింది’’ అని ఖగోళ శాస్త్రవేత్త ఆండ్రూస్ పేర్కొన్నాడు.

భూమికి నష్టం లేదు

సూర్యుని వాతావరణంలో మరుగుతున్న ప్లాస్మా గత వారం మూడు రోజులుగా తయారవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ సౌర సుడిగాలి ప్లాస్మా రూపంలో విభిన్న రకాల పదార్థాలను అంతరిక్షంలోకి పంపింది. ఆయస్కాంతీకరించబడి అక్కడే గాలిలో కలిసిపోయింది కాబట్టి ప్రస్తుతం దానివల్ల భూ గ్రహానికి, సౌర వ్యవస్థలో ఇతర ప్రమాదకర పరిణామాలకు అవకాశం లేదని స్పేస్ వాతావరణ నిపుణులు, సైంటిస్టులు చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి : లోపల చల్లగా ఉండాలంటే.. పై నుంచి ఇది పడాల్సిందే..!

Tags:    

Similar News