మీరు మొటిమల వల్ల బాధపడుతున్నారా?.. ఈ ఆహారాలకు కచ్చితంగా దూరంగా ఉండాల్సిందే!

బేసిక్‌గా అమ్మాయిలు అందానికి ఎక్కువ ఇంపార్టెంట్స్ ఇస్తారు. కాబట్టి ముఖంపై ఒక్క చిన్న మచ్చ ఉన్న తట్టుకోలేరు.

Update: 2024-06-04 04:12 GMT

దిశ, ఫీచర్స్: బేసిక్‌గా అమ్మాయిలు అందానికి ఎక్కువ ఇంపార్టెంట్స్ ఇస్తారు. కాబట్టి ముఖంపై ఒక్క చిన్న మచ్చ ఉన్న తట్టుకోలేరు. అలాంటిది మొటిమలు వస్తే ఇంకా అంతే సంగతులు. అయితే కొందరికి మాత్రం ముఖంపై మొటిమలు ఎక్కువగా ఉండటం వల్ల ముఖ సౌందర్యం డల్‌గా అవుతుందని దానికోసం మార్కెట్‌లో లభించే వివిధ రకాల క్రీమ్స్ వాడుతూ ఉంటారు. కానీ వాటివల్ల డబ్బు వృధా కానీ ప్రయోజనం మాత్రం ఏమీ ఉండదు. కొన్నిసార్లు ఆయిల్ స్కిన్ ఉన్నవారిలో ముఖ సౌందర్యం ఎక్కువగా దెబ్బతింటుంది. దుమ్ము, చెమట , కాలుష్యం ముఖంపై దాడి చేసి మొటిమల సమస్యను రెట్టింపు చేస్తాయి. మొటిమలు , దాని మచ్చలు ముఖం యొక్క అందాన్ని పాడు చేస్తాయి కాబట్టి ఇంట్లో నివారణను కనుగొనడం కష్టమేమి కాదు. అందులోనూ ఈ ఆహారాలకు దూరంగా ఉండటం వల్ల మొటిమల సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు.

మొటిమలతో బాధపడేవారు ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి:

* టీ, కాఫీ తాగే అలవాటు ఉంటే వెంటనే మానేయడం మంచిది. కాఫీలోని కెఫిన్ ఇన్సులిన్ స్థాయిలను పెంచి మొటిమలను కలిగిస్తుంది.

* పాలలో ఉండే గ్రోత్ హార్మోన్ ఐజీఎఫ్-1, బోవిన్ వల్ల చర్మ ఆరోగ్యంపై దుష్ప్రభావాలు ఎక్కువ. దీంతో ముఖంపై వెంట్రుకలు, మొటిమలు ఏర్పడతాయి. పాల వినియోగం మితంగా ఉండాలి.

* ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మొటిమలు రావడానికి ప్రధాన కారణం అవుతుంది. అదే విధంగా ఉప్పు చర్మాన్ని ప్రభావితం చేస్తుంది. ఉప్పు తక్కువగా తినడం వల్ల మొటిమలు దూరం చేసుకోవచ్చు.

* శుద్ధి చేసిన నూనెలు, స్పోర్ట్స్ డ్రింక్స్, సాస్‌లు , కెచప్‌లు, ప్రాసెస్ చేసిన మాంసాలు , కాల్చిన ఆహారాలు వంటి ఒమేగా అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల మొటిమలు ఏర్పడి ముఖం యొక్క రూపాన్ని పాడు చేయవచ్చు. కాబట్టి దాని ఉపయోగం , వినియోగం పరిమితంగా ఉండాలి.

కాబట్టి ఈ ఆహారాలకు దూరంగా ఉండి కాంతివంతమైన మోమును మీ సొంతం చేసుకోండి

పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.


Similar News