వెల్లుల్లి తొక్కలు పడేస్తున్నారా.. అయితే వీటి గురించి తెలుసుకోవాల్సిందే

వెల్లుల్లిని తరచుగా వంటల్లో ఉపయోగిస్తారు

Update: 2024-05-22 06:56 GMT

దిశ, ఫీచర్స్: వెల్లుల్లిని తరచుగా వంటల్లో ఉపయోగిస్తారు. భారతీయ వంటకాలలో వెల్లుల్లి తప్పనిసరి. వెల్లుల్లి కూరల్లో వేసినప్పుడు దాని రుచితో పాటు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అందుకే వెల్లుల్లి ఆయుర్వేద వైద్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, వెల్లుల్లి మాత్రమే కాకుండా.. వెల్లుల్లి తొక్కలు కూడా ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు అందిస్తుంది.

ఆయుర్వేదంలో అద్భుత నివారణగా భావించే వెల్లుల్లిని పురాతన కాలం నుంచి వంటకాలకు మసాలాగా ఉపయోగిస్తున్నారు. రుచి పరంగానే కాదు, చాలా ఆరోగ్యకరమైనది కూడా. వెల్లుల్లిలోని ఔషధ గుణాలు ఎక్కువ. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్, ఫ్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది అనేక వ్యాధుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. చాలామందికి తెలియకుండానే వెల్లుల్లి తొక్కలను పారేస్తుంటారు.

వెల్లుల్లి తొక్కలో ఉండే సల్ఫర్ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇది శరీరం నుండి విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. దీని తొక్కలో ఉండే యాక్టివ్ ఫ్లెవనాయిడ్స్, క్వెర్‌సెటిన్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. అంతే కాకుండా వీటిని తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.


Similar News