అతిగా తినకపోయినా బరువు పెరుగుతున్నారా? ఈ కారణాలే అయ్యుండొచ్చు!
ప్రస్తుత రోజుల్లో బరువు పెరగడం పెద్ద సమస్యగా మారిపోయింది. అనారోగ్యం, హార్మోన్లు, ఆహారం, వయస్సు, హార్డ్ వర్క్ వంటి వివిధ జీవన శైలి కారకాల కారణంగా వెయిట్ తరచూ మారుతూ ఉంటుంది
దిశ, ఫీచర్స్: ప్రస్తుత రోజుల్లో బరువు పెరగడం పెద్ద సమస్యగా మారిపోయింది. అనారోగ్యం, హార్మోన్లు, ఆహారం, వయస్సు, హార్డ్ వర్క్ వంటి వివిధ జీవన శైలి కారకాల కారణంగా వెయిట్ తరచూ మారుతూ ఉంటుంది. అయితే కొంతమంది అతిగా తినడం వల్ల బరువు పెరగుతారు. మరికొంతమంది ఏమీ తినకపోయినా లావు అవుతారు.
చాలా తక్కువ ఫుడ్ తీసుకున్నా బరువు పెరుగుతున్నాం, కడుపు నిండా తినడం లేదు, బరువు కంట్రోల్ లో ఉండకపోగా, ఇంకా లావు అవుతున్నాం అంటూ వాపోతుంటారు. అయితే ఇలాంటి వారు పలు ఆహారపు అలవాట్ల కారణంగా అండ్ ఇతర రీజన్స్ వల్ల వెయిట్ పెరుగుతున్నారని నిపుణులు చెబుతున్నారు. మరీ ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అనారోగ్యకరమైన చిరుతిండి..
ప్రస్తుత రోజుల్లో చిన్నా, పెద్దా అని తేడా లేకుండా స్నాక్స్ తినడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. చాలా మంది ఫ్యాట్స్ అధికంగా ఉండే ప్రాసెస్ చేసిన చిరుతిండిని తింటున్నారు. దీంతో డైట్ కంప్లీట్ గా నాశనమవుతుంది. సరియైన సమయంలో ఫుడ్ తీసుకోకుండా వెయిట్ లాస్ అవ్వాలనే కారణంతో స్నాక్స్ తింటున్నారు. ఈ కారణంగా బరువు పెరుగుతున్నారు. వీటికి బదులుగా ఫ్రూట్స్, కూరగాయలు, నట్స్ తీసుకుంటే వెయిట్ మెయింటైన్ చేయడంతో పాటు హెల్తీగా ఉంటారంటున్నారు నిపుణులు.
మైండ్ లెస్ ఈటింగ్..
చాలా మంది స్మార్ట్ ఫోన్లు, టీవీలు చూస్తూ ఫుడ్ తింటుంటారు. ఈ క్రమంలో మనం ఏం తింటున్నాం. ఎంత తింటున్నాం అనే విషయాన్ని మర్చిపోతుంటాం. దీంతో అధిక బరువు పెరిగే చాన్స్ ఉందంటున్నారు. తినేటప్పుడు ఫోన్లు, టీవీలు చూడకూడదు. కేవలం ఆహారం మీదే శ్రద్ధ పెట్టి తినాలంటున్నారు నిపుణులు.
మీల్స్ పూర్తిగా స్కిప్ చేయడం..
తొందరగా వెయిట్ లాస్ అవ్వాలనే భావనతో కొంతమంది మొత్తమే ఫుడ్ తినరు. మీల్స్ స్కిప్ చేస్తుంటారు. ఒక్క పూట తినడం మానేసి.. మరోపూట తింటారు. అలా తింటే ఇంకా ఎక్కువ బరువు పెరుగుతారు. కాగా బ్యాలెన్సింగ్ మీల్స్ తీసుకోవాలి.
లిక్విడ్ క్యాలరీలు..
ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఉద్యోగులు వర్క్ స్ట్రెస్ నుంచి రిలీఫ్ పొందడం కోసం కాఫీలు, టీలు ఎక్కువగా తాగుతుంటారు. అలాగే మరికొంతమంది షుగర్ కలిపిన జ్యూస్, ఆల్కహాల్ వంటివి తీసుకుంటారు. బరువు పెరగడానికి ఇవి కూడా ఓ కారణమేనంటున్నారు నిపుణులు. కాగా వీటికి బదులుగా హెర్బల్ టీ, మంచినీరు, క్యాలరీలు ఉండే ఫుడ్ తీసుకుంటే ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు అంటున్నారు.
షుగర్ ఎక్కువగా ఉన్న కూల్‌డ్రింక్స్ తీసుకోవడం..
షుగర్ అధికంగా ఉన్న కూల్ డ్రింక్స్ తాగడం వల్ల అధిక బరువు పెరుగుతారు. చాలా మంది ఫుడ్ తినకుండా కూల్ డ్రింక్స్ తాగి కడుపు నింపుకుంటారు. కానీ అది ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. షుగర్ కూల్ డ్రింక్స్ ఏ కాదు.. షుగరీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల చాలా డేంజర్ అంటున్నారు నిపుణులు.
లైఫ్ స్టైల్..
చాలా మంది బరువు తగ్గాలని కేవలం ఆహారం విషయంలో మాత్రమే జాగ్రత్తలు వహిస్తారు. వ్యాయామం చేయడం మర్చిపోతారు. కానీ వ్యాయామం చేస్తే మెటబాలిజం నెమ్మదిస్తుంది. దీంతో ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. అలాగే సమయానికి నిద్రపోవాలి. లేకపోతే హార్మోనల్ బ్యాలెన్స్ ఏర్పడుతుంది. క్రేవింగ్స్ పెరుగుతాయి. తీపి వస్తువులు తినాలనే కోరిక పెరుగుతుంది. స్వీట్ ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారు. కాగా మనిషికి మంచి నిద్ర అవసరం.