పరిగడుపున తేనె నీళ్లు తాగుతున్నారా? అయితే ఈ సమస్యల్లో పడ్డట్లే!
ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యం కోసం, బరువు తగ్గడం కోసం పలు రకాల చిట్కాలు పాటిస్తున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యం కోసం, బరువు తగ్గడం కోసం పలు రకాల చిట్కాలు పాటిస్తున్నారు. అందులో తేనెను ఒక చిట్కాగా ఉపయోగిస్తారు. తేనె శరీరానికీ మేలు చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది. తేనేలో నిమ్మరసం కలిపి తాగితే రోజంతా ఉత్సాహంగా ఉండటమే కాకుండా.. ఫుడ్ డైజేషన్, శరీరంలోని మలినాలను తొలగించడం, విటమిన్ సి ఉన్న నిమ్మరసం రోగనిరోధక శక్తికి పెంచడం, జలుబు, ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండేందుకు ఎన్నో రకాలుగా సహాయపడుతుంది. అలాగే ఉదయాన్నే కాఫీ, టీ తాగడానికి బదులు తేనె, నిమ్మరసం తాగడం హెల్తీగా ఉంటారు. కొవ్వు కూడా కరిగిపోతుంది. కానీ ఈ నీటిని పరిగడుపున తాగడం వల్ల కొన్ని సమస్యల బారిన పడే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* పరిగడుపున నిమ్మకాయ, తేనె మిక్స్ చేసిన నీళ్లు తాగడం వల్ల కొంతమందిలో మంటగా అనిపిస్తుంది. దీంతో అల్సర్ లేక ఎసిడిటీ సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ సమస్య తలెత్తిన వారు.. ఈ చిట్కాను మానేయడం మంచిది. అలాగే వెంటనే డాక్టర్‌ను కలవండి.
* తేనెలో తీపి అధికంగా ఉంటుంది. కాబట్టి మధుమేహ వ్యాధి ఉన్నవారు ఈ చిట్కా పాటించడం మంచిది కాదు. పంచదార, తేనె, ఫ్రక్టోజ్ వంటి వాటిని ఎంత దూరం పెడితే అంత మేలు.
* ఈ నీటిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల కడుపు నొప్పి కూడా వచ్చే ప్రమాదం ఉంది.
* బరువు తగ్గాలని బారియాట్రిక్ సర్జరీ చేపించుకున్నవాళ్లు నిమ్మరసం, తేనె నీటిని అస్సలు తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.