భోజనం తర్వాత గ్రీన్ టీ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి?

ప్రస్తుత రోజుల్లో బరువు పెద్ద సమస్యగా మారిపోయింది.

Update: 2024-01-09 13:00 GMT

దిశ, ఫీచర్స్: ప్రస్తుత రోజుల్లో బరువు పెద్ద సమస్యగా మారిపోయింది. వెయిట్ లాస్ అయ్యేందుకు చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. డైటింగ్, కఠిన వ్యాయామాలు.. చివరకు డాక్టర్లను కూడా సంప్రదించిన వారున్నారు.

అయితే బరువు తగ్గేందుకు ఎన్నో కసరత్తులు చేసినప్పటికీ ముఖ్యంగా ఫుడ్ తీసుకునే విషయంలో దృష్టి పెట్టాలంటున్నారు నిపుణులు. కొంతమంది త్వరగా వెయిట్ లాస్ అవ్వాలనే భావనతో జిమ్‌కు వెళ్లొచ్చాక, వాకింగ్ తర్వాత, భోజనం తిన్న వెంటనే గ్రీన్ తాగేస్తుంటారు. అయితే ఈ వర్కౌట్స్ తర్వాత గ్రీన్ టీ తాగితే ప్రయోజనం చేకురుతుందా? అని ఇలాంటి ప్రశ్నలు చాలా మందిలో తలెత్తే ఉంటాయి. ఈ ప్రశ్నలకు తాజాగా పోషకాహార నిపుణులు క్లారిటీ ఇచ్చారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

భోజనం తర్వాత మీరు గ్రీన్ తాగితే జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. స్టమక్ తక్కువ ఉబ్బినట్లు ఆ అనుభూతిని కలిగిస్తుంది. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు, కాటచిన్‌లు జీవక్రియను పెంచుతాయి. దీంతో బరువు తగ్గే అవకాశం ఉంటుంది. మొత్తానికి గ్రీన్ టీ జీర్ణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలా అని మొత్తం గ్రీన్ టీ మీదనే ఆధారపడితే మాత్రం అనారోగ్య సమస్యల బారిన పడతారు. వెయిట్ లాస్ అనేది మీరు తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులపై ఆధారపడుతుందంటున్నారు నిపుణులు.


Similar News