14 ఏళ్లుగా మూడు పూటలు సుద్ద ముక్కలు తింటున్న వృద్ధురాలు..
దిశ, వెబ్‌డెస్క్: సామాజిక పరిజ్ఞానం పెరిగేకొద్ది ఎన్నో కొత్త రకం వైరైటీ వంటకాలు అందుబాటులోకి వస్తున్నాయి..Latest Telugu News
దిశ, వెబ్‌డెస్క్: సామాజిక పరిజ్ఞానం పెరిగేకొద్ది ఎన్నో కొత్త రకం వైరైటీ వంటకాలు అందుబాటులోకి వస్తున్నాయి. శాకాహారం, మాంసాహారం అంటూ మనుషులు తినే ఆహారాన్ని బట్టి వారి అభిరుచులు రకరకాల వంటకాలను ఎంచుకుంటారు. కానీ, ఓ వృద్ధురాలు మాత్రం సుద్ద గడ్డలను ఎంచుకొని 14 ఏళ్లుగా తింటుంది.
వివరాల్లోకి వెళితే రాజన్న సిరిసిల్ల జిల్లా బందనకల్ గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు14 ఏళ్లుగా సుద్ద ముక్కలు తింటూ బతుకుతుంది.. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే నానుడికి విరుద్ధంగా గత 14 సంవత్సరాలుగా సుద్దగడ్డలే పరమాన్నంగా తింటూ ఒకే బావి నీరు తాగుతుంది ఓ వృద్ధురాలు. అన్నానికి బదులు మూడు పూటలా సుద్దగడ్డలను తీసుకుంటూ జీవిస్తోంది. ఈ విచిత్ర స్థితిని చూసిన కొడుకు, కోడలు మల్లవ్వను ఆసుపత్రికి తీసుకెళ్లగా మల్లవ్వను పరీక్షించిన వైద్యులు ఎలాంటి అనారోగ్యం లేదని తేల్చారు. గత దశాబ్దన్నర కాలంగా ఊరులో ఉన్న ఒకే బావి నీరు తాగుతూ, అన్నానికి బదులు సుద్దగడ్డలను తింటూ జీవిస్తున్న మల్లవ్వను చూసి బంధువులు, గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు.