అంగారక గ్రహంపై మట్టి పగుళ్లు.. ఆశ్చర్యపోయిన ఏలియన్ హంటర్స్
దశాబ్దాల కాలంగా గ్రహాంతర వాసుల ఉనికిని కొనుగొనే ప్రయత్నం చేస్తున్న ఏలియన్ హంటర్స్, సైంటిస్టులు ఇటీవల అంగాకర గ్రహంపై మట్టి పగుళ్లను గుర్తించడంతో ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ
దిశ, ఫీచర్స్ : దశాబ్దాల కాలంగా గ్రహాంతర వాసుల ఉనికిని కొనుగొనే ప్రయత్నం చేస్తున్న ఏలియన్ హంటర్స్, సైంటిస్టులు ఇటీవల అంగాకర గ్రహంపై మట్టి పగుళ్లను గుర్తించడంతో ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ జీవ పరిణామ లక్షణాలు ఉందవచ్చునని భావిస్తున్నారు. మార్స్‌పై గతంలో జీవజాలం మనుగడ ఉండి ఉంటుందని, భవిష్యత్తులోనూ నివాసంగా మారే అవకాశంపై ఈ కొత్త ఆవిష్కరణ ఆశలు రేకెత్తిస్తోందని దక్షణి కాలిఫోర్నియాలోని నాసా కేంద్రానికి చెందిన ప్రొలప్షన్ లాబొరరేటరీకి చెందిన సైంటిస్టులు, ఏలియన్ హంటర్స్ పేర్కొంటున్నారు.
వాస్తవానికి భూమిపై జీవం ఎలా ప్రారంభమైందో సైంటిస్టులు ఇప్పటికీ కొన్ని విషయాల్లో అనిశ్చితంగానే ఉన్నారు. అయితే ఒక ప్రబలమైన థియరీ ప్రకారం.. భూమిపై తడి, పొడి పరిస్థితుల యొక్క నిరంతర సైకిల్స్ సూక్ష్మజీవుల జీవితానికి అవసరమైన కాంప్లెక్స్ కెమికల్ బిల్డింగ్ బ్లాక్స్‌ను సమీకరించడంలో సహాయపడతాయి. ఈ అవగాహన ప్రజెంట్ నాసాకు చెందిన క్యూరియాసిటీ మార్స్ రోవర్ ద్వారా అంగారక గ్రహంపై కనుగొనబడిన పురాతన మట్టి పగుళ్ల విషయంలో ఉత్సాహాన్ని పెంచుతోంది. పైగా ఈ గ్రహంపై గల ఆ మట్టి పగుళ్లు విలక్షణమైన షట్కోణ నమూనా(hexagonal pattern) కలిగి ఉండటాన్ని తడి పొడి సైకిల్స్‌కు సంబంధించిన ఫస్ట్ ఎవిడెన్స్‌గా ఏలియన్ హంటర్స్ అండ్ సైంటిస్టులు పేర్కొంటున్నారు. ఇటువంటి పరిస్థితులు పదే పదే సంభవించినప్పుడు మాత్రమే నిర్దిష్ట బురుద లేదా మట్టి పగుళ్లు ఏర్పడతాయని, బహుశా అంగారక గ్రహంపై కాలానుగుణంగా అలా జరిగి ఉండవచ్చునని ఫ్రాన్స్‌కు చెందిన ప్లానెటోలజీకి చెందిన పరిశోధకుడు విలియం రాపిన్ అటున్నారు. అంగారక గ్రహంపై జీవ ఆవిర్భావం, గ్రహాంతర వాసుల ఉనికి, మనుగడకు అవసరమైన పరమాణు పరిణామం పట్ల ఈ కొత్త ఆవిష్కరణ ఆశలు రేకెత్తిస్తోందని పలువురు సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు.
Read More: మంగళసూత్రంలో పగడం ధరించడం వలన ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసా?