మద్యం ఈ విధంగా సేవిస్తే గుండె జబ్బులు రావట!.. ఎందుకో తెలుసా?

జీవితంలో కొన్ని విషయాలు నాణానికి మరోవైపు అన్నట్లు ఉంటాయి. కొన్నిసార్లు ఒకే విషయంలో మంచి, చెడు ప్రభావాలు కూడా కనిపిస్తుంటాయి. ప్రజెంట్ ఒక సర్‌ప్రైజింగ్ స్టడీ కూడా అదే చెప్తోంది.

Update: 2024-01-03 08:15 GMT

దిశ, ఫీచర్స్ : జీవితంలో కొన్ని విషయాలు నాణానికి మరోవైపు అన్నట్లు ఉంటాయి. కొన్నిసార్లు ఒకే విషయంలో మంచి, చెడు ప్రభావాలు కూడా కనిపిస్తుంటాయి. ప్రజెంట్ ఒక సర్‌ప్రైజింగ్ స్టడీ కూడా అదే చెప్తోంది. ఏంటంటే.. ఆల్కహాల్ అనేది గుండె ఆరోగ్యంపై పాజిటివ్ అండ్ నెగెటివ్ ఇంపాక్ట్స్‌ను కలిగిస్తుందని బోస్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మద్యం సేవించడంవల్ల కొన్ని జీవక్రియలు వాటి ఉనికిని బట్టి కార్డియో వాస్క్యులర్ హెల్త్‌పై సానుకూల ప్రభావం చూపవచ్చునని వీరు గుర్తించారు.

ఈ విషయాన్ని కనుగొనే క్రమంలో పరిశోధకులు 60 ఆల్కహాలిక్ - అసోసియేటెడ్ సర్క్యులేటింగ్ జీవక్రియలను అబ్జర్వ్ చేశారు. అయితే మితమైన స్థాయిలో మద్యపానం సేవించడం అనేది హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించగలదని ఈ సందర్భంగా కనుగొన్నారు. కాగా మరికొన్ని ఇటీవలి అధ్యయనాలు మాత్రం వాస్తవానికి మద్యం మొత్తానికే గుండె ఆరోగ్యానికి ప్రమాదకరమని హెచ్చరించాయి. మొత్తమ్మీద బోస్టన్ యూవర్సిటీ పరిశోధకులు 60 ఆల్కహాల్ కన్సప్షన్ రిలేటెడ్ జీవక్రియలను గమనించగా ఇందులో ఏడు సర్క్యులేటెడ్ జీవక్రియలు మద్యపానం, గుండె జబ్బుల మధ్య సంబంధాన్ని ప్రదర్శించాయి. మరో మూడు సర్క్యులేటెడ్ జీవక్రియలు ఇదే మద్యపాన పద్ధతితో పోల్చినప్పుడు హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తున్నట్లు వెల్లడైంది.


Similar News