Air-Purifying: మొక్కలే ఊపిరి.. చెట్లే ఆధారం.. వాయు కాలుష్యాన్ని తగ్గిస్తున్న ప్లాంట్స్ ఇవే..

Air-Purifying: మొక్కలే ఊపిరి.. చెట్లే ఆధారం.. వాయు కాలుష్యాన్ని తగ్గిస్తున్న ప్లాంట్స్ ఇవే..

Update: 2024-11-20 13:04 GMT

దిశ, ఫీచర్స్ : రోజు రోజుకూ వాతావరణ కాలుష్యం పెరిగిపోతోంది. ముఖ్యంగా ఎయిర్ పొల్యూషన్ ప్రమాదకరంగా మారుతోంది. ఇప్పటికే ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ పొల్యూషన్ ఇండెక్స్ 90.27 వద్ద ఉండగా, హైదరాబాద్‌లో 76.15 ¹ గా ఉంది. బోస్టన్ కాలేజ్ పరిశోధకుల అధ్యయనం ప్రకారం.. 2019లో వాయు కాలుష్యం కారణంగా ఇండియాలో 1.67 మిలియన్ల మంది మరణించారు. ప్రస్తుతం ఆ సంఖ్య పెరిగిందనే అంచనాలు ఉన్నాయి.

గాలి కాలుష్యంవల్ల ప్రజలు కంటి సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు సహా ఇతర అనేక హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దానిని అరికట్టడానికి ప్రభుత్వాలు విధానపరమైన చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా.. ప్రాణాంతకంగా మారుతున్న ఎయిర్ పొల్యూషన్‌‌ను తగ్గించడంలో ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. కాగా కొన్ని రకాల మొక్కలు, చెట్లు గాలిని శుద్ధి చేయడం ద్వారా పొల్యూషన్ ప్రభావాన్ని తగ్గిస్తాయని, మానవ మనుగడకు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. అవి ఏవి? కాలుష్యాన్ని ఎలా తొలగిస్తాయో చూద్దాం.

గాలిని శుద్ధి చేసే మొక్కలు.. వాటి పనితీరు

1. స్పైడర్ ప్లాంట్ (క్లోరోఫైటమ్ కోమోసమ్) ఒకటి. ఇది ఫార్మాల్డిహైడ్, జిలీన్ అండ్ టోలున్‌లను తొలగిస్తుంది.

2. స్నేక్ ప్లాంట్ (సాన్సెవిరియా ట్రిఫాసియాటా) ఇది గాలిలోని ఫార్మాల్డిహైడ్, బెంజీన్, ట్రైక్లోరో ఎతిలిన్‌లను తొలగించడం ద్వారా కాలుష్యాన్ని నివారించడంలో సహాయపడుతుంది.

3. పీస్ లిల్లీ (Spathiphyllum wallisii) ఇది బెంజీన్, ఆసిటోన్, ఇథైల్ ఆసిటేట్‌లను తొలగిస్తుంది.

4. ఇక Dracaena (Dracaena spp) అనే మొక్క కూడా ఠ్రైక్లోరో ఇథైలీన్, ఫార్మాల్డిహైడ్, బెంజీన్లను తొలగిస్తుంది.

5. అలోవెరా (Aloe barbadensis) ఫార్మాల్డిహైడ్, బెంజీన్, ఆసిటోసిన్లను తొలగిస్తుంది.

6. వెదురు పామ్ (Chamaedorea seifrizii): ట్రైక్లోరో ఎథిలిన్, ఫార్మాల్డిహైడ్ (formaldehyde), బెంజీన్‌లను తొలగిస్తుంది.

7. రబ్బర్ ప్లాంట్ (Fraxinus spp) గాలిలోని ఫార్మాల్డిహైడ్, బెంజీన్‌లను తొలగిస్తుంది.

8. ఫిలోడెండ్రాన్ (Philodendron spp) ఫార్మాల్డిహైడ్, జిలీన్ (xylene), టోలున్‌లను తొలగిస్తుంది.

గాలిని శుద్ధి చేసే చెట్లు.. వాటి పనితీరు

1. ఓక్ ట్రీ : (Quercus spp) ఇది గాలిలోని విషపూరిత పదార్థాలను (particulate ) తొలగిస్తుంది. ముఖ్యంగా ఓజోన్, నైట్రోజన్ డయాక్సైడ్లను తొలగించడం ద్వారా మానవాళికి మేలు చేస్తుంది.

2. పైన్ ట్రీ : (Pinus spp.): ఇది కూడా కలుషితాలను, ఓజోన్ అండ్ అస్థిర కరబ్బన సమ్మేళనాలను (VOCs) తొలగిస్తుంది.

3. మాపుల్ ట్రీ (Acer spp): గాలి కాలుష్యాన్ని, అందులోని విష పదార్థాలను శుద్ధి చేస్తుంది. ఓజోన్, నైట్రోజన్ డయాక్సైడ్లను తొలగిస్తుంది.

4. విల్లో ట్రీ (Salix spp.): గాలిలో విష పదార్థాలను, ఓజోన్ కాలుష్యాన్ని, అలాగే అస్థిర కరబ్బన సమ్మేళనాలను తొలగిస్తుంది.

5. యూకలిప్టస్ ట్రీ (Eucalyptus spp.): ఇది పర్టిక్యులేట్ మ్యాటర్ (PM) అంటే.. గాలిలోని ఘన కణాలను, ద్రవ బిందువుల సంక్లిష్ట మిశ్రమం. దీనిని కణ కాలుష్యం అని కూడా అంటారు. నిర్మాణ ప్రదేశాలు, అడవి మంటలు, దహనం వంటి మూలాలు, మానవ చర్యల ద్వారా ఏర్పడే రసాయనిక ప్రతి చర్య. అయితే ఇది గాలిలో కలువడం ప్రమాదకరం. దీనిని తొలగించడంలో యూకలిప్టస్ ట్రీ సహాయపడుతుంది.

6. సైప్రస్ ట్రీ (Taxodium spp.) కూడా గాలి కాలుష్యాన్ని, ముఖ్యంగా శ్వాసకోశ కణజాలాలను దెబ్బతీసే ఓజోన్ కాలుష్యాన్ని, నైట్రోజన్ డయాక్సైడ్‌ను వాతావరణం నుంచి తొలగిస్తుంది.

7. యాష్ ట్రీ (Ash Tree-Fraxinus spp): ఈ చెట్టు గాలిలోని ఓజోన్ కాలుష్యాన్ని, అస్థిర కరబ్బన సమ్మేళనాలను(VOCs) తొలగిస్తుంది.

8. బిర్చ్ ట్రీ (Betula spp) గాలిలోని ఓజోన్ కాలుష్యాన్ని, విష వాయువులను, నైట్రోజన్ డయాక్సైడ్‌లను ఈ చెట్లు తొలగిస్తుంది. శుభ్రమైన గాలిని అందిస్తుంది.

మొక్కలు, చెట్లవల్ల ప్రయోజనాలు

గాలిని శుద్ధి చేసే మొక్కలను పెంచడం, చెట్లను కాపాడటం ద్వారా మానవాళికి మేలు జరుగుతుంది. ముఖ్యంగా వాయు కాలుష్యాన్ని అవి నివారిస్తాయి. పర్యావరణాన్ని సమతుల్యం చేస్తాయి. ఇండోర్ ఎయిర్ క్వాలిటీని పెంచుతాయి. ఆక్సిజన్ లెవల్స్‌ను మెరుగు పరుస్తాయి. కాలుష్యంవల్ల తలెత్తే శ్వాసకోశ ఇబ్బందులను నివారిస్తాయి. వాతావరణం వేడెక్కడాన్ని అడ్డుకుంటాయి. దీనిద్వారా మానసిక, శారీరక ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే గాలిని శుద్ధి చేసే ఇండోర్ ప్లాంట్స్‌ను100 చదరపు అడుగులకు ఒకటి లేదా రెండు మొక్కలను నాటడం మంచిది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో చెట్లను పెంచేవారైతే ఎకరానికి 10 నుంచి 20 వరకు పెంచవచ్చు. ఇలా చేయడం వల్ల పర్యావరణానికి, మానవాళికి మేలు జరుగుతుంది.

Tags:    

Similar News