Air Conditioner: ఈ టిప్స్ పాటిస్తే .. ఏసీ ఎంత వాడిన .. నో పవర్ బిల్

కానీ కరెంట్ బిల్ కట్టేటప్పుడు.. ఇప్పుడు ఇది అవసరమా అని ఫీల్ అవుతుంటారు.

Update: 2023-04-21 07:22 GMT
Air Conditioner: ఈ టిప్స్ పాటిస్తే .. ఏసీ ఎంత వాడిన .. నో పవర్ బిల్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: మనలో కొంత మంది ఆశ పడి ఏసీలు కొనుక్కుంటారు. కానీ కరెంట్ బిల్ కట్టేటప్పుడు.. ఇప్పుడు ఇది అవసరమా అని ఫీల్ అవుతుంటారు. అలాంటి వాళ్లు ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే .. మీ పవర్ బిల్ తక్కువ వస్తుంది. అవేంటో ఇక్కడ చూద్దాం.

1. ప్రతి తలుపు మరియు కిటికీని లాక్ చేయండి: AC ఆన్ చేసే ముందు ఆ రూమ్ లోని ప్రతి తలుపు మరియు కిటికీని మూసివేయండి. ఇలా చేస్తే గాలి లోపలికి రాకుండా ఉంటుంది. అలాగే చల్లటి గాలి బయటకు వెళ్లదు.దీంతో పవర్ కూడా సేవ్ అవుతుంది.

2. ఏసీ ఎప్పుడు స్లీప్ మోడ్‌ లో ఉండేలా చూసుకోండి.. అలాగే ఈ రోజుల్లో చాలా ఏసీలు స్లీప్ మోడ్ ఫీచర్‌ని కలిగి ఉంటున్నాయి. ఈ మోడ్ లో పెట్టడం వల్ల 36 శాతం కరెంట్ సేవ్ అవుతుంది.

3. మీరు ACతో ఫ్యాన్‌ని ఉపయోగిస్తే.. గదిలోని ప్రతి మూల నుండి ఏసీ గాలి వెళ్తుంది.ఇలా చేస్తే గద చల్లగా ఉంచుతుంది. అప్పుడు ఏసీని పెంచాలిసిన అవసరం లేదు.   

Tags:    

Similar News