Aging Gracefully..వృద్ధాప్యాన్ని ఊహించుకొని భయపడుతున్న యువత!

యువత అంటే ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఉండే వయస్సు గలవారని, వారి ఆలోచనలు కూడా అలాగే ఉంటాయని అందరూ అనుకుంటారు.

Update: 2024-01-04 08:05 GMT

దిశ, ఫీచర్స్ : యువత అంటే ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఉండే వయస్సు గలవారని, వారి ఆలోచనలు కూడా అలాగే ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ ఇటీవల యూఎస్ కేంద్రంగా 2000 మంది యంగ్ అడల్ట్స్‌పై వన్‌పోల్ సంస్థ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం.. 18 నుంచి 40 ఏండ్ల మధ్య వయస్సుగలవారిలో 42 శాతం మంది తమకు రాబోయే వృద్ధాప్యం గురించి భయపడుతున్నారు. మరో 23 శాతం మందిలో ఇటువంటి అతి ఆలోచన ఒక రుగ్మతగా మారుతోందని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం దీనికి సైంటిఫిక్ పేరులేదు కానీ ‘ఏజింగ్ గ్రేస్‌ఫుల్లీ డిజార్డర్’ అని మానసిక నిపుణులు పిలుస్తున్నారు. ఇక ఫోర్బ్స్ హెల్త్ రిపోర్ట్ ప్రకారం కూడా అమెరికన్ అడల్ట్స్‌లో చాలామంది పెరిగే కొద్దీ ఆరోగ్య పరమైన సమస్యలకంటే కూడా తమకు వృద్ధాప్యం వస్తే ఎదురు కాబోయే పరిణామాల గురించి ఊహించుకొని భయపడుతున్నారు.

ప్రత్యేకించి బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ, కండరాల క్షీణత, లెస్ ఎనర్జీ, జ్ఞాపకశక్తి క్షీణించడం వంటివి గుర్తు చేసుకొని యువత ఆందోళన చెందుతున్నట్లు సర్వేను ఎనలైజ్ చేసిన నిపుణులు చెప్తున్నారు. ఇక మరో 45 శాతం మంది యువతీ యువకులు ఆర్థరైటిస్, కీళ్ల ఆరోగ్యం లేదా క్షీణత వంటి మొబిలిటీ హెల్త్ ఇష్యూస్ వల్ల వృద్ధాప్యాన్ని ఊహంచుకొని యుక్త వయస్సులోనే భయపడుతున్నారు. 44 శాతం మంది కేవలం డిమెన్షియా అల్జీమర్స్ వంటివి తమను వేధిస్తాయని భయపడుతున్నారు. అయితే ఈ హెల్త్ రిలేటెడ్ అంశాలే కాకుండా 52 శాతం మంది యువత వృద్ధాప్యం కారణంగా తమ కుటుంబ పెద్దలు చనిపోవడాన్ని ఊహించుకొని బాధపడుతున్నారు. 38 శాతం మంది ఆర్థిక ఇబ్బందులు వస్తాయని, 34 శాతం మంది ఇండిపెండెన్స్ లాస్ అవుతామని, 30 శాతం మంది ఒంటరితనంతో ఇబ్బంది పడతామని, 13 శాతం మంది వృద్ధాప్యంలో తమను వృద్ధాశ్రమాలకు తరలిస్తారేమోనని భయపడుతున్నారు.


Similar News