టీ తాగేటప్పుడు అదనంగా చక్కెర వేసుకుంటున్నారా?
టీ అంటే ఇష్టపడని వారు ఉండరు. చాలా మంది ఉదయం కాగానే ఎంతో ఇష్టంగా టీ తాగుతారు. అయితే టీ ఆరోగ్యానికి మంచిదే కానీ అతిగా తాగకూడదంటారు వైద్యులు.మరీ ముఖ్యంగా టీలో అధిక చక్కెర
దిశ, ఫీచర్స్ : టీ అంటే ఇష్టపడని వారు ఉండరు. చాలా మంది ఉదయం కాగానే ఎంతో ఇష్టంగా టీ తాగుతారు. అయితే టీ ఆరోగ్యానికి మంచిదే కానీ అతిగా తాగకూడదంటారు వైద్యులు.మరీ ముఖ్యంగా టీలో అధిక చక్కెర అస్సలే వేసుకోకూడదంట.కొంత మంది టీలో అధికంగా చక్కెర వేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో అదనంగా చక్కెర వేసుకొని టీలో కలుపుకుంటూ తాగుతారు. అయితే ఈ అలవాటు చాలా డేంజర్ అంటున్నారు నిపుణులు.
లిక్విడ్ డ్రిక్స్‌లో అధికంగా చక్కెర తీసుకోవడం వలన కొలెస్ట్రా నుంచి రక్త పోటు స్థాయిలను పెంచుతుందంట. అంతే కాకుండా ఇది గుండె ఆరోగ్యానికి చాలా హానికరం అని చెబుతున్నారు. షుగర్ అధికంగా తీసుకోవడం వలన మధుమేహం, బరువు పెరగడం, ఊబకాయం సమస్యలు ఎదురవుతాయి.వృద్ధులకు అల్జీమర్స్ వచ్చే ప్రమాదం ఉంది. అల్జీమర్స్‌తో పోరాడే ఎంజైమ్‌లకు చక్కెర హానికరం అని తాజా అధ్యయనంలో తేలింది. ఫలితంగా, ఎక్కువ చక్కెర తినడం వల్ల ఆ ఎంజైమ్‌ను నాశనం చేస్తుంది. అల్జీమర్స్ ప్రమాదాన్ని పెంచుతుంది. అంతే కాకుండా అధిక షుగర్ అనేది పిల్లల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు వైద్యులు. అందువలన జ్యూస్, టీ, పాలు లాంటి లిక్విడ్ డ్రింక్స్ తాగిటప్పుడు వాటిలో షుగర్ అనేది అస్సలే వేసుకోకూడదంట.
Read More..
అధిక బరువు తగ్గాలనుకుంటున్నారా?.. డైట్‌లో చియా సీడ్స్ తీసుకోండి !