స్పీడ్ రన్నింగ్ కంటే స్లో రన్నింగే బెటర్.. బెనిఫిట్స్ ఇవిగో !
రన్నింగ్ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే చాలామంది వేగంగా పరుగెత్తడమే ఉత్తమమని భావిస్తారు. ప్రొపెషనల్ రన్నర్స్ లక్ష్యం కూడా అలాగే ఉంటుంది.
దిశ, ఫీచర్స్ : రన్నింగ్ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే చాలామంది వేగంగా పరుగెత్తడమే ఉత్తమమని భావిస్తారు. ప్రొపెషనల్ రన్నర్స్ లక్ష్యం కూడా అలాగే ఉంటుంది. మారథాన్ టైమ్ విషయానికి వస్తే కేవలం రెండు సెకన్లలో 5K వేగంతో పరుగెత్తి టైమ్ సేవ్ చేయాలని చెప్తుంటారు. అందుకోసం నిరంతరం ప్రాక్టీస్ చేసేవారు లేకపోలేదు. కానీ ఇటీవలి కాలంలో ఇందుకు భిన్నంగా ‘స్లో రన్నింగ్ ట్రెండ్’ ఒకటి ముందుకు వచ్చింది. దీని ప్రకారం నెమ్మదిగా పరుగెత్తడంవల్లనే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఈ నెమ్మదైన నడక వెనుక ఉన్న ఆలోచన ఏంటంటే.. ఎవరైనా తమ సామర్థ్యాన్ని బట్టి ఎంత వేగంగా సాధ్యమైతే అంత మేరకు పరుగెత్తవచ్చు. పైగా స్పీడ్ రన్నర్స్‌తో సమానమైన బెనిఫిట్స్ పొందుతారు.
స్లో రన్నింగ్ విధానం కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా ఆనందదాయకంగానూ ఉంటుందని పరిశోధకులు చెప్తు్న్నారు. నెమ్మదిగా నడుస్తున్నట్లు చూపించే పలు ఎవిడెన్స్ కూడా అధిక తీవ్రతతో కూడిన శిక్షణ కంటే కూడా, స్లో రన్నింగ్ శిక్షణ కొన్ని మార్గాల్లో మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఎలియుడ్ కిప్‌చోగ్ లేదా కెల్విన్ కిప్టమ్ వంటి ఎలైట్ రన్నర్స్ గురించి మనం ఆలోచించినప్పుడు వరల్డ్ రికార్డులను నెలకొల్పడానికి వారు ఈ రికార్డ్-సెట్టింగ్ వేగంతోనే ట్రైనింగ్ పొందారని నిపుణులు గుర్తు చేస్తున్నారు.
ఎలైట్ రన్నింగ్
స్లో రన్నింగ్ అలాగే స్పీడ్ రన్నింగ్‌కు మధ్యస్థమైనదే ఎలైట్ రన్నింగ్. ఆశ్చర్యకరంగా ఎలైట్ రన్నర్స్ దాదాపు 80 శాతం సమయాన్ని జోన్ 2 రన్నింగ్‌లో గడుపుతారు. ఈ పరిస్థితి వారి హృదయ స్పందన రేటును పెంచుతుంది. కానీ వారు పరస్పరం మాట్లాడుకునేందుకు అవసరమైనంత నెమ్మదిగా ఉంటుంది. ఈ రన్నర్ల శిక్షణలో దాదాపు 20 శాతం మాత్రమే వారు తమ రేసు వేగానికి దగ్గరగా ఉన్న హయ్యర్ ఇంటెన్సిటీ తీవ్రత జోన్లలో పరుగెడతారు. దీనికి కారణం శిక్షణ బాడీపై కలిగించే ఒత్తిడికి సంబంధించిన అంశమే. రన్నింగ్ స్పీడ్ పెరిగే కొద్దీ శరీరం మరింత ఒత్తిడికి గురవుతుంది కాబట్టి అది ఒక మోతాదులో కొనసాగుతూ పెరగాలి.
స్పీడ్ రన్నింగ్ రిస్క్
స్పీడ్ రన్నింగ్ రిస్క్‌తో కూడి ఉంటుందని తాజా అధ్యనం పేర్కొన్నది. వేగంగా పరుగెత్తుతున్న సందర్భంలో శరీరం ఎంత ఒత్తిడికి గురైతే, ఒక వ్యక్తికి అనారోగ్యం, ఇన్ఫెక్షన్, అలాగే గాయాలు కూడా అంతగా సంభవించే రిస్క్ కూడా పెరుగుతుంది. అందుకే అధిక తీవ్రతతో గడిపే సమయాన్ని తగ్గించడం ద్వారా అథ్లెట్లు అనారోగ్యాలు, ప్రమాదాలను నివారించే ప్రయత్నం చేస్తుంటారు. కానీ స్లో రన్నింగ్ విధానంలో గాయం, అనారోగ్యం ప్రమాదాన్ని తగ్గించడంతోపాటు మరిన్ని ఎక్కువ ప్రయోజనాలే ఉన్నాయంటున్నారు నిపుణులు.
స్లో రన్నింగ్ బెనిఫిట్స్
ముఖ్యంగా స్లో రన్నింగ్ ట్రైనింగ్ ప్రాథమిక అంశమే ‘బేస్’ అని పిలవబడే ఒక విధమైన సరికొత్త ట్రెండ్ లేదా డెవలప్‌మెంట్. ఈ పదం అన్ని రకాల శిక్షణకు సంబంధించిన శారీరక పునాదులను వివరిస్తుంది. ఎండ్యూరెన్స్ రన్నర్ కోసం ఇది మంచి బేస్‌లైన్ కార్డియో-రెస్పిరేటరీ ఫిట్‌నెస్‌ను సూచిస్తుంది. దానిపై తమ హయ్యర్ ఇంటెన్సిటీ అడాప్టేషన్స్‌ను నిర్మించవచ్చు. ఒక పిరమిడ్ లాగా.. ఆలోచిస్తే గనుక ఇది మిగిలిన స్ట్రక్చర్‌ను నిర్మించే సాలిడ్ బేస్‌ను కలిగి ఉంటుంది. బేస్ ఎంత పెద్దదైతే పిరమిడ్ అంత ఎత్తుగా ఉంటుంది కదా.. స్లో రన్నింగ్ బెనిఫిట్స్ కూడా అలాగే ఉంటాయి. బేస్ ఎంత మెరుగ్గా ఉంటే అధిక తీవ్రతతో పనిచేసేటప్పుడు అంత సామర్థ్యం కలిగి ఉంటారు. ఇక్కడ ఫిజికల్ స్ట్రెస్ చాలా తక్కువగా ఉంటుంది.
కొవ్వును బర్న్ చేస్తుంది
నెమ్మదిగా పరుగెత్తడం వల్ల శరీరం శక్తి కోసం నిల్వ చేయబడిన కొవ్వును ఉపయోగించుకుంటుంది. మనం తినే ఆహారాల నుంచి వచ్చే కార్బోహైడ్రేట్ స్టోర్స్‌పై ఆధారపడకుండా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. కొవ్వును బర్న్ చేయడం అనేది జీవక్రియ పరంగా చాలా సమర్థవంతమైన ప్రాసెస్. ఎందుకంటే కొవ్వు యొక్క ఒక అణువు నుంచి పొందిన ఎనర్జీ మొత్తం కార్బోహైడ్రేట్ అణువు నుంచి చాలా ఎక్కువగా ఉంటుంది. దీని అర్థం ఏంటంటే. రన్నర్లు మొత్తంగా తక్కువ శక్తిని ఉపయోగిస్తారు. తక్కువ అలసటతో ఉంటారు. హై ఇంటెన్సిటీగల పరుగులను తరచుగా ఉపయోగించే అథ్లెట్‌లతో పోలిస్తే స్లో రన్నర్‌లలో ఏరోబిక్ బేస్‌లో ఐదు రెట్లు ఎక్కువగా ప్రయోజనం ఉంటుంది.
VO2 కెపాసిటీ
స్లో రన్నింగ్ విషయానికి వస్తే VO2 (ఆక్సిజన్ కెపాసిటీ) గరిష్టంగా ఉంటుంది. స్లో రన్నింగ్‌లో ఎక్కువ సమయం గడిపే అథ్లెట్లకు దాదాపు 1 శాతం ఎక్కువ బెనిఫిట్స్ కలిగిస్తుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా హై ఇంటెన్సిటీగల పరుగులను తరచుగా ఉపయోగించే అథ్లెట్‌లతో పోలిస్తే స్లో రన్నర్‌లలో ఏరోబిక్ బేస్‌లో లాభాలు ఐదు రెట్లు ఎక్కువగా ఉంటాయి. మీరు అథ్లెట్ కానప్పటికీ మీ పరుగులలో ఎక్కువ భాగాన్ని తక్కువ తీవ్రతతో ఉంచడం ఇప్పటికీ సరైనది అంటున్నారు నిపుణులు.
నెమ్మదిగా.. స్థిరంగా
మీరు స్లో రన్నింగ్‌ని ప్రయత్నించాలని ఆసక్తిగా ఉన్నట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ విషయం మీ వేగం. నెమ్మదిగా నడుస్తున్నట్లు వర్గీకరించే సందర్భంలో మీరు సరైన వేగంతో ఉన్నారని ఎలా తెలుసుకుంటారు? అయితే కొంతమంది శాస్త్రవేత్తలు నడుస్తున్న వేగాన్ని ఐదు లేదా ఆరు వేర్వేరు జోన్లుగా విభజిస్తారు. శారీరకంగా జోన్ 2 అనేది లాక్టేట్ థ్రెషోల్డ్ కింద సంభవించినట్లు నిర్వచించబడింది. లాక్టేట్ (శక్తి కోసం కార్బోహైడ్రేట్లను బర్న్ చేయడం ప్రారంభించినప్పుడు శరీరం ఉత్పత్తి చేసే ఆమ్లం) మొదట రక్తంలో కనిపించడం ప్రారంభిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే.. ఇది మీరు కన్వర్జేషన్‌ను కొనసాగించగలిగే వేగంతో ఉండాలి. మీ హృదయ స్పందన రేటు మీ గరిష్టంలో 70 శాతం మాత్రమే ఉంటుంది. కానీ చాలా ప్రయోజనాలు ఉంటాయి.