WhatsApp : ఈ వాట్సాప్ స్మార్ట్ ఫీచర్స్‌ను ఎంజాయ్ చేయండి.. చాట్ లాక్ వేసుకోవడంతో సహా బోలెడన్నీ ప్రైవసీ టిప్స్..

వాట్సాప్.. మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ముఖ్యంగా కుటుంబీకులు, ఫ్రెండ్స్, ఆఫీస్ కొలీగ్స్.. ఇలా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నా ముందుగా గుర్తొచ్చేది ఇదే యాప్. డైరెక్ట్ మెసేజ్ చేసే సౌలభ్యం ఉన్నా సరే జస్ట్ వాట్సాప్ ఓపెన్ చేసి.. సమాచారం అందించుకుంటారు. చాలా సంస్థలు

Update: 2024-08-27 18:05 GMT

దిశ, ఫీచర్స్ : వాట్సాప్.. మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ముఖ్యంగా కుటుంబీకులు, ఫ్రెండ్స్, ఆఫీస్ కొలీగ్స్.. ఇలా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నా ముందుగా గుర్తొచ్చేది ఇదే యాప్. డైరెక్ట్ మెసేజ్ చేసే సౌలభ్యం ఉన్నా సరే జస్ట్ వాట్సాప్ ఓపెన్ చేసి.. సమాచారం అందించుకుంటారు. చాలా సంస్థలు ఈ యాప్ ఉపయోగించే వర్క్ నడిపిస్తున్నాయి కూడా. ఈ ఫ్రెండ్లీ యాప్ పై అంత నమ్మకం ఉంది మరి. మాటలు లేనప్పుడు స్టేటస్ లేదా డీపీ ద్వారా తమ భావాలను వ్యక్తపరచడం కూడా ఇందులో ఒక ప్లస్ పాయింట్. కాగా ఇంతకు మించిన అదిరిపోయే లేటెస్ట్ అప్ డేట్స్ తీసుకొంచింది వాట్సాప్. వాటిని ఎలా వాడాలి? ఆ ట్రిక్స్ ఏంటి? అనేది తెలుసుకుందాం.

ఇన్ స్టాంట్ మెసేజ్

దాదాపు రెండు బిలియన్ యూజర్లు ఉన్న వాట్సాప్ ను సరిగ్గా వినియోగించుకోవడం 98% మందికి తెలియదని చెప్తున్నారు నిపుణులు. ఇందులో మెసేజ్ చేయాలంటే కచ్చితంగా నెంబర్ సేవ్ చేసుకోవాలనే అనుకుంటారు కానీ అలా కాకుండా డైరెక్ట్ ఫోన్ నెంబర్ కు మెసేజ్ చేయొచ్చు. వాట్సాప్ డైరెక్ట్ అని మీ బ్రౌజర్ లో టైప్ చేస్తే లింక్ వచ్చేస్తుంది. మీరు మెసేజ్ పంపాలి అనుకున్న నెంబర్ అక్కడ టైప్ చేయమని కోరుతుంది. నెంబర్ ఇచ్చాక చాట్ ఓపెన్ కాగానే.. అక్కడ మీరు పంపాలనుకున్న మ్యాటర్ టైప్ చేసి సెండ్ చేస్తే సరిపోతుంది. మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఒకరిని యాడ్ చేసుకునే ఇబ్బంది లేకుండా ఉండేందుకే ఈ వాట్సాప్ డైరెక్ట్ సర్వీస్.

క్రియేట్ ఓన్ స్టిక్కర్స్

టెక్స్ట్ బాక్స్‌కు కుడివైపున ఉన్న స్టిక్కర్ ఐకాన్ ఎంచుకుని.. స్టిక్కర్ ట్రేని ఓపెన్ చేయండి. ఇప్పుడు క్రియేట్ స్టిక్కర్ చూజ్ చేయండి. మీ గ్యాలరీ నుంచి ఫోటోను సెలెక్ట్ చేసుకుని.. టెక్స్ట్, డ్రాయింగ్‌, ఇతర స్టిక్కర్‌లను యాడ్ చేయడం ద్వారా మీ స్టికర్ ను కస్టమైజ్ చేసుకోండి. ఆ తర్వాత సెండ్ చేయండి. అంతేకాదు మీరు వాట్సాప్ నుంచి స్టికర్ ప్యాక్స్ కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

అన్ డూ డిలీట్ ఫర్ మీ

మనం అనుకోకుండా మెసేజ్ లేదా ఫొటో డిలీట్ చేసినప్పుడు.. ఇంపార్టెంట్ అయితే చాలా బాధపడతాం. కానీ ఇలా డిలీట్ చేసిన సందేశాన్ని రికవర్ చేసుకోవచ్చు. సింపుల్ గా దానిపై అన్ డు ఆప్షన్ అప్లయ్ చేస్తే చాలు. మీరు కావాలనుకున్న మెసేజ్ లేదా ఫొటో తిరిగి పొందవచ్చు.

పిన్ ఇంపార్టెంట్ మెసేజెస్

గ్రూప్ లో చాలా మెసేజ్ లు వస్తుంటాయి. కానీ అందులో కొన్ని మాత్రమే మనకు పనికి వస్తాయి లేదంటే అవసరం అవుతాయి. కానీ ఈ మెసేజ్ కోసం గ్రూప్ లో వెతకాల్సి ఉంటుంది. అలాంటి కష్టం లేకుండా పిన్ చేసుకునే ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. మీకు కావాలనుకున్న మెసేజ్ మీద ప్రెస్ అండ్ హోల్డ్ చేసి.. పిన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది.

చాట్ లాక్

మీరు మీ ఫ్రెండ్స్ లేదా కొలీగ్స్ తో ఇంపార్టెంట్ మ్యాటర్ లేదా పార్టీ గురించి షేర్ చేసుకున్నారు. అది మరొకరికి కనిపించకూడదని అనుకున్నారు. కానీ డిలీట్ చేస్తే ఇన్ఫర్మేషన్ పోయే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఆ మేసేజ్ లేదా చాట్ డిలీట్ చేయకుండా.. జస్ట్ లాక్ చేస్తే సరిపోతుంది. మరొకరు ఓపెన్ చేసి చూడకుండా సెక్యూర్ గా ఉంటుంది. ఇలా

స్పెసిఫిక్ చాట్స్ కు ఎక్స్ ట్రా ప్రైవసీ అందించండి. వచ్చిన మెసేజ్ చదివేందుకు లేదా సెండ్ చేసేందుకు లాక్ ఓపెన్ చేయాలంటే డివైజ్ అథెంటికేషన్ అవసరం అవుతుంది. అంటే ఫోన్ పాస్ కోడ్, ఫేస్ ఐడి లేదా ఫింగర్ ప్రింట్ యూజ్ చేయాల్సి ఉంటుంది.

మెటా AI

Meta AI మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. మీకు హెల్ప్ చేస్తుంది. స్టూడెంట్స్, ఎంప్లాయీస్ తమ వర్క్ ఈజీగా చేసుకునే సౌలభ్యాన్ని అందిస్తుంది. మీరు ఎలాంటి సమాచారం అడిగినా అందిస్తుంది. అయితే దీంతోపాటు మీరు మీ క్రియేటివిటీకి కూడా పదును పెట్టొచ్చు. మీరు మీ మైండ్ లో ఏం ఇమాజిన్ చేసుకుంటున్నారో దాన్ని ఇమేజ్ రూపంలో క్రియేట్ చేయవచ్చు.

Tags:    

Similar News