మ్యాట్రిమోనియల్ స్కామ్... మధ్య వయస్కులు, వితంతువులే టార్గెట్

గత దశాబ్దంలో ఆన్‌లైన్ మ్యాచ్ మేకింగ్ పెరిగిపోయింది. వ్యక్తులు తమ భాగస్వామిని కనుగొనే ప్రయత్నాన్ని సులభతరం చేసింది. అదే సమయంలో మోసాలు కూడా అధికమవుతూ వస్తున్నాయి.

Update: 2024-09-17 13:46 GMT

దిశ, ఫీచర్స్ : గత దశాబ్దంలో ఆన్‌లైన్ మ్యాచ్ మేకింగ్ పెరిగిపోయింది. వ్యక్తులు తమ భాగస్వామిని కనుగొనే ప్రయత్నాన్ని సులభతరం చేసింది. అదే సమయంలో మోసాలు కూడా అధికమవుతూ వస్తున్నాయి. నేరస్తులు ఈ ప్లాట్ ఫామ్ ను బాగా వాడుకుంటున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో 2022 నివేదిక ప్రకారం.. మహిళలపై జరిగే సైబర్ క్రైమ్‌లలో మ్యాట్రిమోనియల్ స్కామ్ అత్యంత సాధారణ రూపాల్లో ఒకటి. కాగా ఈ సైట్‌ల ద్వారా మగవారిచే మోసగించబడుతున్న స్త్రీల గురించిన వార్తా కథనాలు ఇందుకు నిదర్శనం.

మ్యాట్రిమోనియల్ సైట్‌ల ద్వారా స్కాం పెరుగుతుందనే ఆందోళన ఇప్పటికే ఉండగా... తాజాగా థానేలో ఓ వ్యక్తి పెళ్లి సాకుతో మహిళపై అత్యాచారం చేసి రూ. 39 లక్షల మోసం చేశాడు. మొదటి వివాహం విఫలమవడంతో రెండో పెళ్లి చేసుకోవాలనుకున్న 37 ఏళ్ల మహిళకు మ్యాట్రిమోనియల్ యాప్ ద్వారా 40 ఏళ్ల వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ వ్యక్తి ఆమెకు చాలా రోజులుగా కాంటాక్ట్ లో ఉన్నాడు. వివాహానికి సంబంధించిన మరిన్ని వివరాలను చర్చించడానికి రెస్టారెంట్‌లో కలవాలని అడిగాడు. అప్పుడే ఆమెకు డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచి చూసేసరికి హోటల్ గదిలో వివస్త్రగా పడి ఉంది. ఇదే బాధ అనుకుంటే కొద్ది రోజులు తర్వాత ఆమెను నగ్నంగా తీసిన ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేసాడు. అప్పుడు ఆయన గురించి డీప్ గా వాకబు చేసిన ఆమె.. అతనికి ఆల్రెడీ పెళ్లి అయిందని, పిల్లలు ఉన్నారని తెలుసుకుంది.

మరో కేసులో గత 20ఏళ్లుగా మ్యాట్రిమోనియల్ పోర్టల్స్ ద్వారా 50 మంది మహిళలను పెళ్లి చేసుకుని లక్షల్లో మోసం చేసిన 55 ఏళ్ల వ్యక్తిని గురుగ్రామ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని జంషెడ్‌పూర్‌కు చెందిన తాపేష్‌గా గుర్తించారు. 1992లో కోల్‌కతాలో తొలిసారి వివాహం చేసుకున్న అతనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కానీ 2000 సంవత్సరంలో వారిని వదిలేసి అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత ఒక మహిళ తాపేష్‌ను మ్యాట్రిమోనీ యాప్‌లో కలిసింది. పెళ్లి చేసుకుంది. కానీ అతను మూడో రోజే ఆమె దగ్గర కోట్లు కాజేసి నగలతో సహా ఉడాయించాడు. ఇన్వెస్టిగేషన్ చేస్తే

బెంగళూరుకు వెళ్లి "స్మార్ట్ హైర్ సొల్యూషన్" పేరుతో జాబ్ ప్లేస్‌మెంట్ ఏజెన్సీని ప్రారంభించాడు. నిజానికి అతను ముందు ఉద్యోగం పేరుతో మోసాలకు పాల్పడ్డాడు కానీ దాని కన్నా మ్యాట్రిమోనియల్ స్కామ్ ఈజీ అని తెలుసుకుని.. విడాకులు తీసుకున్న, వితంతువు మహిళల డిటైల్స్ తీసుకుని, వారికి కాంటాక్ట్ చేసి

డేటింగ్ ప్రారంభించేవాడు. టైం చూసుకుని మోసం చేసి పారిపోయేవాడు. ఎట్టకేలకు ఈ నిందితుడు ఒడిశాలో అరెస్టు అయ్యాడు. ఇలా చాలా కేసులు ఉండగా మహిళలు అన్నీ తెలుసుకున్నాకే పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకోవాలని జాగ్రత్తలు చెప్తున్నారు పోలీసులు, నిపుణులు.

మోసం చేయడానికేనా?

మోసగాళ్లు మ్యాట్రిమోనియల్ ప్లాట్‌ఫామ్‌లను స్కామ్ చేయడానికి అనువైన ప్రదేశాలుగా భావిస్తున్నారు, ఎందుకంటే సోషల్ మీడియా లేదా డేటింగ్ ప్లాట్‌ఫామ్‌లతో పోలిస్తే మహిళలు ఇక్కడ తమకు సంబంధించిన పూర్తి, నిజమైన సమాచారాన్ని అందిస్తారు. వివాహం కోసం చూస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే నేరస్తులు మధ్య వయస్కులైన, విడాకులు పొందిన లేదా వితంతువుల స్త్రీలను లక్ష్యంగా చేసుకోవడానికి కారణం వివాహితులు మాత్రమే ఆదర్శవంతమైన స్త్రీలని సమాజం నమ్ముతుంది. దీన్ని నిలబెట్టుకోవడానికి ఇలా సింగిల్ గా ఉండిపోయిన మధ్యవయస్కులు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో మోసాలకు బలవుతున్నారు.

భద్రత ఎందుకు లేదు?

మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లు లైఫ్ పార్ట్‌నర్‌లను కనుగొనడానికి అత్యంత ప్రజాదరణ పొందిన, విశ్వసనీయ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటిగా పరిగణించబడుతున్నాయి. కానీ ఈ కంపెనీలు తమ క్లయింట్‌ల భద్రతను నిర్ధారించడం లేదనేది స్పష్టం అవుతుంది. అనేక మ్యాట్రిమోనియల్ అప్లికేషన్‌ల కోసం రిజిస్టర్ చేసుకోవడానికి అవసరమైన ధృవీకరణ ఆదేశాలు ఉన్నాయి. కానీ పెరుగుతున్న మ్యాట్రిమోనియల్ స్కామ్‌లు అవి సరిపోవని స్పష్టం చేస్తున్నాయి.

ఎప్పటికప్పుడు పెరుగుతున్న టెక్నాలజీ యూజ్ చేసే మోసగాళ్లు ఆన్ లైన్ లో ఉన్నందునా.. తమ క్లయింట్‌లను రక్షించడంలో మరింత సెక్యూరిటీ చెక్ అవసరం. జనాదరణ, భారీ క్లయింట్ బేస్ పొందిన మ్యాట్రిమోనియల్ యాప్స్.. మోసగాళ్లు ప్రవేశించలేని ఫూల్‌ప్రూఫ్ ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించే బాధ్యత తీసుకోవాలి.


Read More...

చంద్రగ్రహణం సమయంలో గర్భిణీలు పాటించాల్సిన నియమాలేంటో తెలుసా.. 


Tags:    

Similar News