డ్రిల్ మిషిన్‌తో కన్నం చేయడం మాత్రమే కాదు.. పిండి కూడా రుబ్బవచ్చు..!?
వింటర్ సీజన్ రాగానే వేడివేడిగా బజ్జీలు, పకోడీలు ఇలా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది.
దిశ, ఫీచర్స్ : దిశ, ఫీచర్స్ : వింటర్ సీజన్ రాగానే వేడివేడిగా బజ్జీలు, పకోడీలు ఇలా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఆవపిండి, మొక్కజొన్న రొట్టె లాంటి తినుబండారాలను తినాలనుకుంటారు. తినడం వరకు ఈసీనే కానీ ఆ పిండి కలపడానికే కాస్త శ్రమపడాల్సి వస్తుంది. కానీ ఓ యువకుడు దీని కోసం ఓ మంచి ఉపాయాన్ని కనిపెట్టాడు. ఇలాంటి ఉపాయాల గురించి విన్నప్పుడు పెద్ద పెద్ద ఇంజనీర్లు కూడా వీరి ముందు పనికిరారు అనిపిస్తుంది. అంతే కాదు ఆ ఉపాయం గురించి వింటే ముక్కున వేలేసుకుని ఔరా అనుకుంటారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ ఉపాయం ఏంటి.. ఆ యువకుడు ఎవరు.. ఇప్పుడు తెలుసుకుందాం..
ఓ వ్యక్తి పెద్దకుక్కర్‌లో పిండి మిశ్రమాన్ని కలిపేందుకు కూర్చున్నాడు. పక్కనే కూర్చున్న మహిళ మరొక పాత్రలో ఉంచిన మొక్కజొన్న పిండిని తీసుకొని కుక్కర్‌లో పోస్తుంది. ఆ పిండిని ఆ వ్యక్తి కలిపే ప్రక్రియను ప్రారంభించాడు. అయితే చేతితో కాదండి ఏం చక్కా ఓ డ్రిల్లింగ్ మిషన్‌తో పిండి కలిపేందుకు వినియోగించుకున్నాడు. అతను మెషిన్‌ను బ్లెండర్ లాగా వాడాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఈ వీడియో sukhwinder.virdi.984 అనే ఖాతా ద్వారా X లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను లక్ష మందికి పైగా లైక్ చేశారు.