అత్యంత ప్రమాదకరమైన పని చేస్తున్న మహిళ.. నెలకు రూ. 5 లక్షల వేతనం..

ప్రపంచంలో అనేక రకాల ఉద్యోగాలు ఉన్నాయి. వాటిలో కొన్ని సులభంగా ఉంటే మరికొన్ని ఉద్యోగాలు మాత్రం అతి కష్టంతో కూడుకున్నవి.

Update: 2024-05-05 11:24 GMT

దిశ, ఫీచర్స్ : ప్రపంచంలో అనేక రకాల ఉద్యోగాలు ఉన్నాయి. వాటిలో కొన్ని సులభంగా ఉంటే మరికొన్ని ఉద్యోగాలు మాత్రం అతి కష్టంతో కూడుకున్నవి. జీతం ఎక్కువ వస్తుందనుకున్నా ప్రాణాలను పణంగా పెట్టడం మాత్రం తప్పదు. అలాంటి పనులను చేసేందుకు సాధారణంగా ఎవరూ ముందుకు రారు. ఇప్పుడు అలాంటి ఒక పని గురించి మనం తెలుసుకుందాం.

కష్టతరమైన పనుల్లో సముద్రపు లోతుల్లోకి వెళ్లి అన్వేషించడం కూడా ఒకటి. చాలామందికి ఇది తేలికగా అనిపిస్తున్నా చాలా ప్రమాదంతో కూడుకున్న పని. చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలను కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీరే ఆలోచించండి అలాంటి పని ఎవరైనా చేయాలనుకుంటారా. కానీ ఈ ప్రమాదకరమైన పనిని సంతోషంగా చేసే ఓ మహిళ ఉంది. ఈ పని చేయడం వల్ల ప్రతినెలా లక్షల రూపాయలు సంపాదిస్తున్నానని చెప్పింది.

ఈ మహిళ పేరు లార్కిన్ బోహన్. ఆమె వయస్సు 44 సంవత్సరాలు. లార్కిన్ ప్రపంచంలోని లోతైన మహాసముద్రాలలో పనిచేస్తుందని చెప్పింది. తాను విలాసవంతమైన జీవితాన్ని ఎలా గడుపుతుందో, డబ్బును ఎలా సంపాదిస్తుందో ఆమె వెల్లడించింది. తను చేసే పని ద్వారా రోజుకు 700 పౌండ్లు అంటే సుమారు 73 వేల రూపాయలు సంపాదించవచ్చని చెబుతుంది. అంతే కాదు వసతి, భోజనం అన్ని ఉచితం అని ఆమె చెబుతుంది.

సముద్రపు లోతుల్లో పని..

లార్కిన్ గత 12 సంవత్సరాలుగా అప్రసిద్ధమైన ఉత్తర సముద్రాన్ని, మరియానా ట్రెంచ్‌ను సందర్శించినట్లు చెప్పారు. దీన్ని ప్రపంచంలోని లోతైన సముద్రపు ద్రోణిగా చెబుతారు. దీని లోతు దాదాపు 11 కిలోమీటర్లు ఉంటుందట. క్రేన్లు, భారీ పరికరాలతో సముద్రపు లోతుల్లో పనిచేయాల్సి వస్తోందని చెప్పింది. చాలాసార్లు వారు అలాంటి బరువైన పరికరాలను మోసుకుంటూ నీటి అడుగున వెళ్ళవలసి వస్తుందట. అందుకే ఈ పని చేయాలంటే శరీరం దృఢంగా ఉండాలని చెప్పింది.

ఏటా రూ.62 లక్షలు..

లార్కిన్ తన పని సమయంలో ఉచిత వసతి, ఆహారం మాత్రమే కాకుండా, ప్రతి సంవత్సరం 60 వేల పౌండ్లు అంటే 62 లక్షల రూపాయల కంటే ఎక్కువ సంపాదిస్తుందని తెలిపారు. కొంతమంది నావికులు ప్రతిరోజూ 700 పౌండ్లు అంటే దాదాపు 73 వేల రూపాయలు సంపాదిస్తున్నారని చెప్పారు. ఒకసారి సముద్రం లోపలికి వెళ్లి 60 రోజుల పాటు భూమిని చూడలేదని ఆమె తన పని గురించి చెబుతుంది. అయినప్పటికీ వారికి ఎటువంటి సమస్య లేదు, ఎందుకంటే ఫైవ్ స్టార్ హోటళ్ళు, మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులు వంటి సౌకర్యాలు పెద్ద ఓడలలో అందుబాటులో ఉన్నాయి.


Similar News