Viral video : ఓర్నీ.. దీని తెలివి తగలెయ్య..! ఎంత పనిచేసిందో చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Viral video : ఓర్నీ.. దీని తెలివి తగలెయ్య..! ఎంత పనిచేసిందో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

దిశ, ఫీచర్స్ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సృష్టిస్తున్న అద్భుతాల్లో హ్యూమనాయిడ్ రోబోట్స్ ఒకటి. అచ్చం మనుషుల్లా ప్రవర్తించే వీటి సేవలను ప్రస్తుతం అనేక రంగాల్లో వినియోగించుకుంటున్నారు. వంట చేయడం, అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, ఇల్లు ఊడ్చడం వంటి పనులను కూడా ఈ రోబోట్‌లు చేసిపెడుతున్నాయి. ముఖ్యంగా బిజీ బిజీగా గడిపే వారికి, పనులు చేసుకునే సమయం, ఓపిక లేనివారికి వీటివల్ల ఎంతో మేలు జరుగుతోంది. అలాంటి దృశ్యాన్నే కళ్లకు కట్టే ఓ హ్యూనాయిడ్ రోబోట్ తెలివైన పనితీరుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో రోబోట్ చేసిన పనికి అందరూ ఫిదా అవడమే కాకుండా ఫన్నీ కామెంట్స్‌తో ముంచెత్తుతున్నారు. ఇంతకీ ఏం చేసిదంటే..
వైరల్ సమాచారం ప్రకారం.. ఓ ఎల్లోకలర్ హ్యూమనాయిడ్ రోబోట్ అచ్చం మనిషిలా ప్రవర్తిస్తూ.. వస్తువులు సర్దుతూ ఇంట్లో చెత్త ఊడుస్తోంది. ఈ క్రమంలో అది టీవీ దగ్గరున్న షోకేజ్‌పై వస్తువులను కూడా సర్దుతోంది. అంతేకాకుండా పనికిరాని వస్తువులను కింద పడేసి వాటిని ఊడ్చేస్తోంది. అయితే ఈ సందర్భంగానే అది చేసిన పని నిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది. కడుపుబ్బా నవ్వించింది. అది చూసిన ఆ క్షణం ‘ఓర్నీ.. రోబోట్ తెలివి తగలెయ్య ఇంత టాలెంటెడ్‌గా ఉందేంట్రా బాబూ..’ అనే ఫన్నీ డైలాగ్ గుర్తుకొస్తుంది ఎవరికైనా. ఎందుకంటే అది వస్తువులను సర్ది, చెత్తను ఊడ్చి ఏ చెత్తబుట్టలోనో వేయలేదు. అప్పుడప్పుడూ అలసిపోయి, ఓపిక లేకనో, పనిచేయడం ఇష్టం లేకనో కొన్నిసార్లు పిల్లలు, పెద్దలు చేస్తారు కదా..! అలాగే రోబోట్ కూడా చేసింది. చెత్తను బయటకు ఊడ్చకుండా అక్కడున్న షోకేజ్ టేబుల్ కిందకు ఊడ్చేసి.. మమా! అనిపించేసింది. ఇది చూసిన నెటిజన్లంతా ‘‘It's closing hour’, Robot is tired - maybe its battery is weak, Even robots are imitating human , God is great’’ వంటి కామెంట్లతో పాటు పలు ఫన్నీ అండ్ సెటైరికల్ కామెంట్లతో రియాక్ట్ అవుతున్నారు. ఆలస్యమెందుకు మీరూ చూసేయండి!