Viral video : బ్రదర్ అంటే నువ్వే రా పొట్టోడా..! ఎంతైనా గట్స్ ఉండాలె నీ లెక్క..!
Viral video : బ్రదర్ అంటే నువ్వే రా పొట్టోడా..! ఎంతైనా గట్స్ ఉండాలె నీ లెక్క..!

దిశ, ఫీచర్స్ : బాల్యం ఓ తీపి జ్ఞాపకం. కల్లా కపటం ఎరుగని మనస్తత్వానికి నిదర్శనం. ఏ స్వార్థమూలేని ఆనంద మయ జీవితానికి ప్రతీక. అందుకేనేమో ఎన్నటికీ తిరిగి రాదని తెలిసినా.. వస్తే బాగుండు అనిపిస్తుంది ఎవరికైనా.. ఇకపోతే బాల్యంలో చేసే ప్రతీ పని అద్భుతం.. బాల్యంలో గడిచే ప్రతీ క్షణం ఓ మధురానుభూతికి నిదర్శనం అంటుంటారు పెద్దలు. అంతేకాదు అప్పుడప్పుడూ పిల్లలు గొప్ప గొప్ప పనులు కూడా చేసి ప్రశంసలు అందుకుంటారు. అటువంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతూ తెగ ఆకట్టుకుంటోంది.
వైరల్ వీడియో ఇన్ఫర్మేషన్ ప్రకారం.. ఒక ఇంటిలోని సెకండ్ ఫ్లోర్‌లో ఐదేండ్లలోపు వయసుగల అన్నా, చెల్లి ఆడుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో వారు ఇంట్లో కిటికీ పక్కనే ఉన్న సోఫాపై ఎక్కి బయటకు చూసే ప్రయత్నం చేస్తారు. అలా సరదాగా ఆడుతున్న సందర్భంలో ఆ ఇద్దరు చిన్నారుల్లో ఓ చిన్న పాప కిటికీలోంచి బయటకు వస్తుంది. రెండవ అంతస్తులో ఉన్న ఆ కిటికీ నుంచి కిందకు దిగే ప్రయత్నం చేస్తుంది. పరిస్థితి చూస్తుంటే.. ఏమాత్రం క్షణం ఆలస్యమైనా ఆ చిన్నారి కిందపడి ప్రాణాలు కోల్పోయేది. కానీ.. అంతలోనే ఆ చిన్నారి అన్న (Brother) గమనించి వెంటనే వచ్చి, తన చిట్టి చెల్లిని కాపాడుతాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. బ్రదర్ అంటే నువ్వే రా పొట్టోడా..! ఎంతైనా గట్స్ ఉండాలె నీ లెక్క..! అంటూ రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు. అయితే ఈ వీడియో నిజమైంది కాదు.. ఏఐ ట్రిక్‌ను ఉపయోగించి రూపొందించారు. కానీ నిజమైన వీడియోలా నెటిజన్లను ఆకట్టుకోవడం గమనార్హం.