రేడియేషన్‌ వెలువడే ప్రాంతంలో నివసిస్తున్నారా? .. తర్వాత జరిగేది ఇదే..

రేడియోధార్మికతకు గురైతే పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని మనకు తెలిసిందే. ప్రజెంట్ ఇటువంటి పరిస్థితులు ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Update: 2024-01-15 06:21 GMT

దిశ, ఫీచర్స్ : రేడియోధార్మికతకు గురైతే పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని మనకు తెలిసిందే. ప్రజెంట్ ఇటువంటి పరిస్థితులు ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకూ పెరిగిపోతున్న సెల్‌ఫోన్ టవర్స్, యాంటెన్నాలు, పవర్ ప్లాంట్స్ వంటివి వాతావరణంలోకి రేడియేషన్‌ను రిలీజ్ చేస్తున్నాయి. దీని కారణంగా పరిసర ప్రాంతాల్లో నివరిసంచే వారు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని ఒక స్టడీలో వెల్లడైంది. ముఖ్యంగా సంతానలేమి, నరాల బలహీనత, వినికిడి సమస్యలు, మధుమేహం, మతిమరుపు వంటివి రేడియేషన్‌వల్ల సంభవిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యలుగా ఉంటున్నాయి.

అధ్యయనంలో భాగంగా జపనీస్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్‌కు చెందిన రీసెర్చర్స్ 5,326 మంది ఎమర్జెన్సీ వర్కర్స్‌‌ను అబ్జర్వ్ చేశారు. రేడియేషన్ ఎక్స్‌పోజర్‌కు గురయ్యే వారిలో డయాబెటిస్ రిస్క్ ఎక్కువగా ఉంటున్నట్లు ఈ సందర్భంగా నిర్ధారించారు. కొద్దిరోజులు రేడియో ధార్మికత ప్రభావానికి గురి కావడంవల్ల మధుమేహంతో పాటు నరాల బలహీనత, వినికిడి సమస్యలు, జ్ఞాపశక్తి తగ్గడం వంటి ప్రాబ్లమ్స్ బాధితులు ఫేస్ చేస్తున్నట్లు గుర్తించారు. కాగా రేడియేషన్ ఎఫెక్టును కొలిచేందుకు పరిశోధకులు పాకెట్ అలారం డోసిమీటర్‌లను యూజ్ చేశారు. తరచుగా రేడియేషన్ వెలువడే ప్రాంతాల్లో గడపడంవల్ల 6.5 శాతం మందిలో మధుమేహం డయాబెటిస్‌ డెవలప్ అయినట్లు నిర్ధారించారు. పైగా అధికస్థాయి రేడియోధార్మికత గురయ్యే వారిలో సాధారణ వ్యక్తులతో పోల్చితే గ్లూకోజ్ డిజార్డర్ 48 శాతం ఎక్కువగా ఉంటోందట.


Similar News