పిల్లల్లో పెరిగిపోతున్న స్ట్రెస్, యాంగ్జైటీస్.. కారణం ఇదే !

పిల్లలు ఎప్పుడూ హ్యాపీగా ఉంటారనే అందరం అనుకుంటాం. కానీ ఉరుకుల పరుగుల జీవితం, చిన్న ఏజ్‌లోనే చదువుల భారం, పెద్దలు అర్థం చేసుకోలేకపోవడం వంటి కారణాలతో వారు కూడా ఆందోళన చెందుతారని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

Update: 2024-01-08 13:38 GMT

దిశ, ఫీచర్స్ : పిల్లలు ఎప్పుడూ హ్యాపీగా ఉంటారనే అందరం అనుకుంటాం. కానీ ఉరుకుల పరుగుల జీవితం, చిన్న ఏజ్‌లోనే చదువుల భారం, పెద్దలు అర్థం చేసుకోలేకపోవడం వంటి కారణాలతో వారు కూడా ఆందోళన చెందుతారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. 8 నుంచి 12 ఏండ్లలోపు వయస్సుగల ప్రతి ముగ్గురిలో ఒకరు మెంటల్ స్ట్రెస్, యాంగ్జైటీస్‌‌లను ఎదుర్కొంటున్నట్లు ‘వాట్ వర్రీయింగ్ ఇన్ కిడ్స్‌’ పేరుతో నిర్వహించిన ఒక రీసెంట్ స్టడీలో వెల్లడైంది. ఇది వారి ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెప్తున్నారు. పైగా స్కూల్ స్థాయిలోనే చాలా మంది పిల్లలు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇందులో తోటి స్నేహితుల దురుసు ప్రవర్తనవల్ల 41% పిల్లలు ఒత్తిడికి గురవుతుడగా 35 శాతం మంది తాము ఎంతో ఇష్టపడే పేరెంట్స్, ఫ్రెండ్స్ ఆరోగ్యం గురించి, అలాగే పేరెంట్స్‌తో ఎక్కువసేపు గడపలేకపోతున్నామని ఆందోళన చెందుతున్నారు.

స్కూల్ స్థాయిలోనే 65 శాతం మంది పిల్లలు తమ లుక్స్, బాడీ ఇమేజింగ్ విషయంలో వర్రీ అవుతున్నారట. అధ్యయనం ప్రకారం.. 55 శాతం మంది బెదిరింపులవల్ల ఆందోళన చెందుతున్నారు. 46 శాతం మంది వారానికి ఒకటికంటే ఎక్కువసార్లు తమ ఫ్రెండ్స్ వల్ల ఒత్తిడికి గురవుతున్నారు. ఇక 21 శాతం మంది పిల్లలు వీక్లీవన్స్ డబ్బులు లేకపోవడంతోఆందోళన చెందుతున్నారు. మరో 20 శాతం మంది పిల్లలు హింసాత్మక సంఘటనలు, వీడియోలు చూసినప్పుడు, వార్తలు విన్నప్పుడు ఆందోళన చెందుతుండగా, 19 శాతం మంది పర్యావరణం వంటి అంశాల కారణంగా స్ట్రెస్‌కు గురవుతున్నారు. అయితే ఇటువంటి ఆందోళన, భయం, ఒత్తిడి 40 శాతం మంది పిల్లల్లో ఏకాగ్రత లోపించడానికి, 34 శాతం మంది పిల్లల్లో లోన్లీనెస్ ఫీలింగ్స్ కలగడానికి, 23 శాతం మంది పిల్లల్లో వివిధ మానసిక, శారీరక అనారోగ్యాలకు కూడా కారణం అవుతున్నాయి. అందుకే పిల్లల్లో ఆందోళన, ఒత్తిడిని తగ్గించే బాధ్యత పేరెంట్స్, టీచర్స్, సమాజంపై ఉందని సూచిస్తున్నారు.


Similar News