పక్షుల కిలకిల రావాలు.. మీలో ఆందోళన పోగొడతాయని తెలుసా?
పక్షుల కిలకిల రావాలు వినడం ఎవరికైనా ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే ఈ శబ్దాలు మెంటల్ హెల్త్‌పై కూడా ఎఫెక్ట్ చూపుతాయని మీకు తెలుసా? కానీ ఇది నిజం.
దిశ, ఫీచర్స్ : పక్షుల కిలకిల రావాలు వినడం ఎవరికైనా ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే ఈ శబ్దాలు మెంటల్ హెల్త్‌పై కూడా ఎఫెక్ట్ చూపుతాయని మీకు తెలుసా? కానీ ఇది నిజం. పక్షులు చేసే రకరకాల శబ్దాలు వినడంవల్ల మనసు కుదుట పడుతుందని, మానసిక వికాసానికి అవసరమైన హర్మోన్స్ బాడీలో రిలీజ్ అవుతాయని ‘జర్నల్ ఆఫ్ ఆక్యుపేషనల్ అండ్ ఇన్విరాన్‌మెంటల్ మెడిసన్’కు చెందిన నిపుణుల అధ్యయనంలో వెల్లడైంది. స్టడీలో భాగంగా వారు తరచూ పక్షులను చూస్తూ, వాటి శబ్దాలు వింటూ గడిపేవారిని, అందకు భిన్నమైన జీవన శైలి కలిగి ఉన్న వారిని టోటల్ 26 మందిని రెండు గ్రూపులుగా విభజించి, ఏడాదిపాటు అబ్జర్వ్ చేశారు. కాగా వీరిలో పక్షుల శబ్దాలు వినేవారు ఎప్పుడూ హ్యాపీగా, యాక్టివ్‌గా గడుపుతుంటే.. అందుకు భిన్నమైన వెదర్‌లో ఉండేవారు అనవసర ఆలోచనలు, ఆందోళనలు, డిప్రెషన్స్ వంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నట్లు తేలింది.
మరో సందర్భంలో కూడా పక్షుల శబ్దాలు వినగలిగే ప్రాంతాల్లో నివసించే 295 మందిని రీసెర్చర్స్ పరిశీలించారు. ఇందులో కొందరు డిప్రెషన్ బాధితులు కూడా ఉన్నారు. కాగా తరచుగా పక్షుల శబ్దాలు వినే అవకాశం ఉన్న ప్రాంతాల్లో నివాసించే వారిలో కొంతకాలానికి భావోద్వేగాలను అంచనా వేయగా.. ప్రతి ఒక్కరి మానసిక పరిస్థితి మెరుగు పడింది. పైగా డిప్రెషన్ లక్షణాలు తగ్గాయని పరిశోధకులు కనుగొన్నారు. అంతేకాకుండా పచ్చని చెట్లు, పక్షులు ఎక్కువగా శబ్దాలు చేసే నేచర్ మధ్య గడిపేవారిలో జ్ఞాపశక్తి పెరగడం, సంతోషం, ఉత్సాహం వంటివి రెట్టింపు కావడం, అలాగే వివిధ మానసిక రుగ్మతలు తగ్గుముఖం పట్టడం వంటివి పరిశోధకులు గుర్తించారు. అందుకే ఏ మాత్రం అవకాశం ఉన్నా అందమై ప్రకృతిని ఆస్వాదించాలని, భిన్నమైన పక్షుల స్వరాలను వినాలని నిపుణులు సూచిస్తున్నారు.