ముక్కులో వేలు పెట్టే అలవాటుతో మెమొరీలాస్.. చుట్టుముడుతున్న వ్యాధులు..
కొందరు తరచూ ముక్కులో వేలు పెట్టడం, పొక్కులు తీయడం చేస్తుంటారు.
దిశ, ఫీచర్స్: కొందరు తరచూ ముక్కులో వేలు పెట్టడం, పొక్కులు తీయడం చేస్తుంటారు. ఇటువంటి అలవాటు కారణంగా అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో తేలింది. ఇలా ముక్కు తీయడం వల్ల అంతర్గత కణజాలాలు దెబ్బతినడమే గాక, కొన్ని రకాల బ్యాక్టీరియాలు ముక్కు నుంచి నేరుగా మెదడులోకి చేరుతాయి. అవి మెదడుకు చేరాక అల్జీమర్స్ సింప్టమ్స్‌ను కలిగిస్తాయని సైంటిస్టులు ఎలుకలపై నిర్వహించిన అధ్యయనం ద్వారా తెలుసుకున్నారు.
ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ యూనివర్శిటీ పరిశోధకులు 2022లో క్లామిడియా బ్యాక్టీరియాతో ప్రయోగాలు చేశారు. అయితే ఇది ప్రజలకు సోకడంవల్ల న్యుమోనియాకు దారితీస్తుందని, అదే విధంగా మెదడులోకి ప్రవేశించడం ద్వారా ఆలస్యంగా ప్రారంభమయ్యే అల్జీమర్స్‌కు కారణం అవుతుందని కనుగొన్నారు. నాసికా కుహరం(nasal cavity), మెదడును కలుపుతూ ఎలుకలలోని ఘ్రాణ (జ్ఞాపకశక్తికి కారణం అయ్యే నాడి) నాడిపైకి బ్యాక్టీరియా లేదా వైరస్‌లు వెళతాయని నిరూపితమైంది. అదనంగా నాసల్ ఎపిథీలియం, నాసల్ ట్యూబ్ పైన కప్పబడి ఉండే సన్నని కణజాలం దెబ్బతిన్నప్పుడు నరాల ఇన్ఫెక్షన్లు తలెత్తుతాయి. ఫలితంగా అంటువ్యాధులకు కారణమయ్యే స్రవించే అమిలాయిడ్ బీటా ప్రోటీన్ ఎక్కువ మొత్తంలో నోటిలో, మెదడులో (mouse brains) నిక్షిప్తమై ఉంటుంది. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు ఈ ప్రోటీన్‌వల్ల ఎక్కువ మొత్తంలో ముక్కులో ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటుంటారని గ్రిఫిత్ యూనివర్సిటీకి చెందిన న్యూరో సైంటిస్ట్ జేమ్స్ సెయింట్ అన్నారు.
క్లామిడియా న్యుమోనియా నేరుగా ముక్కులోకి, మెదడులోకి వెళ్లి అల్జీమర్స్ వ్యాధిలా కనిపించే పాథాలజీలను సెట్ చేయగలదదని తాము కనుగొన్నట్లు కూడా వెల్లడించాడు. ఎలుకల కేంద్ర నాడీ వ్యవస్థలకు సోకిన సి. న్యుమోనియా వైరస్ వేగంగా 24 నుంచి 72 గంటలలోపు ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుండటం పరిశోధకులను ఆశ్చర్యపరిచింది. కొన్ని థియరీల ప్రకారం.. బ్యాక్టీరియా, వైరస్ ముక్కు నుంచి మెదడుకు చేరడం చాలా సులభం. ఎలుకల్లో ఇలా జరగడాన్ని చూస్తే మనుషులలో కూడా జరుగుతుందనే అనుమానాలు బలపడ్డాయని నిపుణులు అంటున్నారు. అదేగనుక నిజమైతే ముక్కుతీయడం అనేది చాలామందికి ఒక భయానక విషయంగా ఉంటుందని చెప్తున్నారు.
Also Read..