పక్కింటి వాళ్లు పేదవారు అయితే.. బ్రెయిన్ ట్యూమర్ ఎఫెక్ట్

బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్లలో కొన్నిసార్లు జ్ఞానం లేదా జ్క్షాపకశక్తి క్షీణించే అవకాశం ఉంటుంది.

Update: 2023-05-02 08:06 GMT

దిశ, ఫీచర్స్: బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్లలో కొన్నిసార్లు జ్ఞానం లేదా జ్క్షాపకశక్తి క్షీణించే అవకాశం ఉంటుంది. అయితే దీనిపై కొంతమేరకు నైబర్‌హుడ్ ప్రభావం కూడా ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. రేడియేషన్ థెరపీకి ముందు పేషెంట్లను అంచనా వేసేందుకు నిపుణులు ‘కాగ్నెటివ్ ఔట్ కమ్స్’ను విశ్లేషించడం ద్వారా పలు ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నారు. బ్రెయిన్ ట్యూమర్ సమస్య అధికంగా ఉన్న పిల్లల్లో, పెద్దల్లో జ్ఞాన క్షీణతను అంచనా వేయడానికి వారి చుట్టూ ఉండే వాతావరణ పరిస్థితులు, వనరులు, కుటుంబం, ఇరుగు పొరుగువారి ప్రభావాన్ని స్టడీ చేశారు.

ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ఇరుగు పొరుగు వారి కంటే సహాయక వాతావరణం, అనుకూలమైన వనరులు కలిగి ఉండే నైబర్ హుడ్స్‌తో అనుబంధం కలిగి ఉన్న బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్లు మెరుగ్గా ఉన్నారని, కణుతుల కారణంగా వారిలో జ్ఞాన క్షీణత తక్కువగా ఉందని నిపుణులు పేర్కొన్నారు. అలాగే ఇరుగు పొరుగు వారు పేదరికంతో బాధపడుతుండటం, సపోర్టుగా నిలవకపోవడం, కుటుంబంలోని పేదరికం వంటి ఆలోచనలు బ్రెయిన్ ట్యూమర్ ఉన్న పేషంట్లలో జ్ఞాపక శక్తి, జ్ఞాన క్షీణతకు కారణం అవుతున్నాయని పరిశోధకులు కనుగొన్నారు.

సింప్లెస్ట్ లెవెల్‌లో పేషెంట్ చుట్టూ ఉండే ఎన్విరాన్‌మెంట్ ముఖ్యమైందని గుర్తించినట్లు తెలిపారు. రోగ నిర్ధారణ, ట్రీట్‌మెంట్ విధానమేగాక పేషెంట్ యాక్సెస్ చేయగలిగే కుటుంబం, ఇరుగు పొరుగు వారితో కలిగి ఉన్న అనుబంధం, సపోర్ట్ కూడా కాగ్నెటివ్ ఫలితాలను అంచనా వేస్తుందని తెలిపాడు. మొత్తానికి అధిక పేదరికం ఉన్న ప్రాంతాల్లోని పరిస్థితులు బ్రెయిన్ ట్యూమర్ రోగులను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని పేర్కొన్నాడు.

Tags:    

Similar News