తప్పుల నుంచి గుణ‌పాఠం నేర్చుకుంటున్న జెల్లీ ఫిష్.. కారణం ఏంటంటే..

వీటిపట్ల ఇప్పటికే ఉన్న అవగాహనను కొత్త అధ్యయనం సవాలు చేస్తోందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Update: 2023-09-24 07:05 GMT

దిశ, ఫీచర్స్: జెల్లీ ఫిషెస్ వాస్తవానికి చాలా తెలివైనవని, ప్రత్యేకించి కరేబియన్ బాక్స్ జెల్లీ ఫిషెస్ గతంలో ఊహించిన దానికంటే అధిక సామర్థ్యం కలిగి ఉన్నాయని తాజా పరిశోధనలో వెల్లడైంది. వీటిపట్ల ఇప్పటికే ఉన్న అవగాహనను కొత్త అధ్యయనం సవాలు చేస్తోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ముఖ్యంగా ఈ జీవులు తమ తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకొని వ్యవహరిస్తున్నట్లు పేర్కొంటున్నారు. సాంప్రదాయకంగా జెల్లీ ఫిషెస్ 500 మిలియన్ సంవత్సరాల క్రితం అభివృద్ధి చెందిన సినిడారియన్లలో భాగమైన తొలి జీవులతోపాటు డెవలప్ అయినట్లు పరిశోధకులు భావిస్తున్నారు.

బాక్స్ జెల్లీ ఫిషెస్ తమ సమర్థవంతమైన సాధారణ నాడీ వ్యవస్థల కారణంగా ప్రైమేటివ్ లెర్నింగ్ ఎబిలిటీస్ కలిగిన ఆదిమ జీవులుగా పరిగణించబడ్డాయి. అయితే వీటిలో క్రమంగా డెవలప్ అయిన మోడర్న్ నర్వ్ సిస్టమ్స్ జంతువులలో అధునాతన అభ్యాస సామర్థ్యంతో పరస్పర సంబంధం కలిగి ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎక్కువగా కరేబియన్ మడ అడవుల చిత్తడి నేలల్లో నివసిస్తున్న ఈ విషపూరిత బాక్స్ జెల్లీ ఫిషెస్ శరీర నిర్మాణంలో గల చిన్న కోపెపాడ్స్‌, అవి ఆహారాన్ని వేటాడేందుకు దోహదం చేస్తాయని, ఈ సందర్భంగా అవి తమ తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకుంటాయని కోపెన్‌హాగన్ యూనివర్సిటీకి చెందిన న్యూరోబయాలజిస్ట్ ప్రొఫెసర్ ఆండర్స్ గార్మ్ తెలిపారు. కొత్త అధ్యయనం ప్రకారం జెల్లీ ఫిషెస్ తమ బిహేవియర్‌ను మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉండటానికి వాటిలో అత్యంత దృఢమైన నాడీ వ్యవస్థే ప్రధాన కారణమని పేర్కొంటున్నారు. అందుకే అవి ఫ్రూట్ ఫ్లైస్, ఎలుకల వంటి అధునాతన జంతువులతో పోల్చదగిన లెర్నింగ్ సామర్థ్యాన్ని ప్రదర్శించ గలుగుతాయని చెప్తున్నారు. 


Similar News