యంగ్ ప్రొఫెషనల్స్ వద్దు.. రిక్రూటర్స్ ప్రయారిటీ ఎవరికో తెలుసా?
ఎంప్లాయర్స్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో భాగంగా సహజంగానే తమ సంస్థల్లో 25 ఏండ్లలోపు యువతీ యువకులను నియమించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతారని అందరూ అనుకుంటారు.
దిశ, ఫీచర్స్ : ఎంప్లాయర్స్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో భాగంగా సహజంగానే తమ సంస్థల్లో 25 ఏండ్లలోపు యువతీ యువకులను నియమించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతారని అందరూ అనుకుంటారు. కానీ ఇది వాస్తవం కాదని ఒక తాజా సర్వే వెల్లడించింది. వర్క్ ఎక్స్‌పీరియన్స్‌లేని జన్ జెర్స్ (gen Z )కంటే అనుభవం, నైపుణ్యం ఉన్న ఓల్డర్ ప్రొఫెషనల్స్‌ను నియమించుకోవడానికే యాజమాన్యాలు మొగ్గు చూపుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. సర్వేలో భాగంగా ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ అండ్ ప్రొఫెషనల్స్ లైఫ్‌పై ఫోకస్ చేసిన ఒక ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ సంస్థ ఇటీవల 800 మంది మేనేజర్స్, డైరెక్టర్స్ అండ్ ఎగ్జిక్యూటివ్స్‌ను నియామకాల విషయంలో ఎటువంటి వారిని సెలెక్ట్ చేస్తారనే విషయంలో సర్వే నిర్వహించింది.
ఎక్స్‌పీరియన్స్‌కే ప్రయారిటీ
సర్వే ప్రకారం కాలేజ్ గ్రాడ్యుయేట్స్ అప్లికెంట్స్ కంటే కూడా ఓల్డర్ అప్లికెంట్స్‌కే రిక్రూటర్స్ ప్రయారిటీ ఇస్తున్నారు. అందుకు గల కారణాలను కూడా వారు విశ్లేషిస్తున్నారు. యంగ్ జాబ్ సీకర్స్ తరచుగా పేరెంట్స్‌తో కలిసి ఇంటర్వ్యూలకు అటెండ్ కావడం, వారిలో స్కిల్స్ లేకపోవడం, నైపుణ్యం లేకపోయినా ఎక్కువ సాలరీలు డిమాండ్ చేయడం యాజమాన్యాలు వారిపట్ల ఆసక్తిచూపకపోవడానికి ప్రధాన కారణగాలుగా ఉంటున్నాయి. ఇక 39% మంది ఎంప్లాయర్స్ ఇటీవలి కాలంలో క్వాలిఫైడ్ గ్రాడ్యుయేట్లకంటే వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉందా?.. లేదా? అనే దానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మరో 53% మంది యజమానులు యంగ్ జాబ్ సీకర్స్ ఇంటర్వ్యూలోనే బ్యాడ్ ఇంప్రెషన్ కలిగిస్తున్నందువల్ల ఆసక్తి చూపడం లేదట.
63 శాతం మందిలో ప్రాబ్లం ఇదే..
50% మంది రిక్రూటర్స్ యువ ఉద్యోగార్థులు అన్ రీజనబుల్ పేమెంట్ కోరుతారు కాబట్టి నియమించుకోవడానికి మొగ్గు చూపడం లేదని వెల్లడించారు. 20 శాతం మంది అయితే యువతీ యువకుల్లో అన్ ప్రొఫెషనల్ లుక్స్ ఉండటం, డ్రెస్‌సెన్స్ సరిగ్గా లేకపోవడంవల్ల ఉద్యోగాలు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. 63% యాజమాన్యాలు యంగ్ జాబ్ సీకర్స్ వర్క్‌లోడ్‌ను మేనేజ్ చేయడంలో ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించారు. 61% మంది అయితే యువ ఉద్యోగులు తరచుగా కార్యాలయాలకు ఆలస్యంగా వస్తారు అందుకే వారికి ప్రాముఖ్యత ఇవ్వడం లేదని పేర్కొన్నారు. మరో 59% మంది యజమానులు యంగ్ ప్రొఫెషనల్స్ రెగ్యులర్‌గా డెడ్‌లైన్స్ మిస్ అవుతుండగా, వారిలో 53% సమావేశాలకు డుమ్మా కొడుతున్నారని తెలిపారు. ఇంకో 57% మంది యువత తమకు వృత్తినైపుణ్యం లేదని కూడా అంగీకరిస్తోందని వెల్లడించినట్లు సర్వే పేర్కొన్నది.