ఆటిజం రిలేటెడ్ యాంగ్జైటీ.. కొత్త మెడికేషన్‌ను కనుగొన్న పరిశోధకులు

అతి చురుకుదనం, అతిధోరణి వంటి ఆటిజం రిలేటెడ్ రుగ్మతలతో బాధపడే వ్యక్తులు ఎక్కువగా యాంగ్జైటీకి గురవుతుంటారు. కౌమార దశలో ఉన్నప్పుడు అయితే ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది.

Update: 2024-01-29 08:45 GMT

దిశ, ఫీచర్స్ : అతి చురుకుదనం, అతిధోరణి వంటి ఆటిజం రిలేటెడ్ రుగ్మతలతో బాధపడే వ్యక్తులు ఎక్కువగా యాంగ్జైటీకి గురవుతుంటారు. కౌమార దశలో ఉన్నప్పుడు అయితే ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. బాధితుల్లో ఈ ఆందోళన తగ్గించడానికి పరిశోధకులు ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టారు. అయితే ఇప్పటికే అందుబాటులో ఉన్న బ్లడ్ ప్రెజెర్ మెడికేషన్ అయిన ప్రొప్రానోలోల్ యాంగ్జైటీని సమర్థవంతంగా తగ్గిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ మిస్సౌరీ-కొలంబియా యొక్క థాంప్సన్ సెంటర్‌ ఫర్ ఆటిజం అండ్ న్యూరో డెవలప్‌మెంట్ పరిశోధకులు తాజాగా గుర్తించారు.

స్పెక్ట్రమ్ డిజార్డర్‌కు పరిష్కారం

నిజానికి ప్రొప్రానోలోల్ (propranolol) అనేది హైపర్ టెన్షన్, లోయర్ బ్లడ్ ప్రెజెర్ ట్రీట్మెంట్‌కు సాంప్రదాయకంగా రెఫర్ చేయబడుతున్న బీటా బ్లాకర్, ఇది కార్డియో వాస్క్యులర్ మెడిసిన్ కూడాను. ప్రస్తుతం ఇది ఆందోళనను తగ్గించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు పరిశోధనలో తేలింది. పిల్లలు, యువకుల్లో ప్రస్తుతం ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ASD) అనేది ఒక తీవ్రమైన సమస్యగా మారుతోంది. అయితే తాజా పరిశోధన ఇందుకు చక్కటి పరిష్కారాన్ని కనుగొన్నదని రీసెర్చర్స్ అంటున్నారు.

తగ్గుతున్న యాంగ్జైటీ

ఆటిజం, ఆందోళనతో పోరాడుతున్న ఆటిస్టిక్ వ్యక్తులకు ప్రొప్రానోలోల్ ఎలా యూజ్ అవుతుందో తెలుసుకునే క్రమంలో రీసెర్చర్ డేవిడ్ బెవర్స్‌డోర్ఫ్ నేతృత్వంలోని బృందం మూడు సంవత్సరాల కాలంలో మొత్తం 69 మంది రోగులను స్టడీ చేసింది. ఈ సందర్భంగా పరిశోధకులు చాలా విషయాలను అబ్జర్వ్ చేశారు. ప్లేసిబో తీసుకునే రోగుల సమూహంతో పోలిస్తే, ప్రొప్రానోలోల్ తీసుకునే పార్టిసిపెంట్స్‌లో 12 వారాల చెక్-అప్ అపాయింట్‌మెంట్‌లో యాంగ్జైటీ లెవల్స్ గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు.

మరో ప్రత్యామ్నాయం లేదా?

‘‘ఆటిజంతో బాధపడుతున్న వ్యక్తులకు ఆందోళనను తగ్గించడానికి ప్రొప్రానోలోల్ సపోర్టివ్ ఇంటర్‌ వెన్షన్‌గా ఉపయోగపడుతున్నట్లు పరిశోధనలు చూపిస్తున్నాయి’’ అని ఎంయూ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అండ్ ఎంయు కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్‌కు చెందిన పరిశోధకుడు డాక్టర్ బెవర్స్‌డోర్ఫ్ అంటున్నారు. ఈ మెడికేషన్ 1960ల నుంచి అందుబాటులో ఉంది. అంతేకాకుండా చవకైనది కూడా. ఇప్పటి వరకు ఆటిజంతో బాధపడుతున్న వ్యక్తుల కోసం ప్రత్యేకంగా మానసిక సమస్యలను టార్గెట్‌గా చేసుకునే మెడికేషన్స్ ఏవీ అందుబాటులో లేవు. కాబట్టి తాజా ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని రీసెర్చర్స్ అంటున్నారు. అయితే ప్రొప్రానోలోల్ వినియోగానికి సంబంధించిన పరిశోధనకు సబంధించిన ఫైనల్ రిపోర్టు తర్వాత దానిని ఎలా యూజ్ చేయాలనే దానిపై క్లారిటీ ఇవ్వనున్నట్లు పరిశోధకులు చెప్తున్నారు.


Similar News