ఎల్ఐసీ ఛైర్మన్‌గా ఎంఆర్ కుమార్ పదవీకాలం పొడిగింపు..
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ దిగ్గజ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ఛైర్మన్ ఎంఆర్ కుమార్ పదవీకాలాన్ని 2022, మార్చి 13 వరకు పొడిగించేందుకు లైన్ క్లియర్ అయింది. ప్రస్తుతం నెల జూన్ 30తో ముగియనున్న ఆయన పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ ఆర్థిక సేవల విభాగం ప్రతిపాదనను కేబినేట్ నియామక కమిటీ ఆమోదించినట్టు బుధవారం ఓ ప్రకటనలో నియామక కమిటీ సెక్రటేరియట్ తెలిపింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ ఐపీఓకు రానున్న కారణంగా […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ దిగ్గజ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ఛైర్మన్ ఎంఆర్ కుమార్ పదవీకాలాన్ని 2022, మార్చి 13 వరకు పొడిగించేందుకు లైన్ క్లియర్ అయింది. ప్రస్తుతం నెల జూన్ 30తో ముగియనున్న ఆయన పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ ఆర్థిక సేవల విభాగం ప్రతిపాదనను కేబినేట్ నియామక కమిటీ ఆమోదించినట్టు బుధవారం ఓ ప్రకటనలో నియామక కమిటీ సెక్రటేరియట్ తెలిపింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ ఐపీఓకు రానున్న కారణంగా ఎంఆర్ కుమార్‌నే తిరిగి నియమించడం కీలకమని ఆర్థిక సేవల విభాగం భావిస్తోంది.
కరోనా మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో ఎల్ఐసీ సంస్థకు చెందిన వాటాను విక్రయించడం ద్వారా రూ. 90 వేల కోట్లకు సేకరించాలని కేంద్రం భావిస్తోంది. ఈ మొత్తం ఎల్ఐసీ 6-7 శాతానికి సమానం. రూ. 39.51 లక్షల కోట్ల ఆస్తులను కలిగిన దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు ఎస్‌బీఐ తర్వాత రూ. 31 లక్షల కోట్ల ఆస్తులతో అత్యధిక ఆస్తులు కలిగిన సంస్థగా రెండోస్థానంలో ఎల్ఐసీ ఉంది. కాగా, ఎల్ఐసీ సంస్థ 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ. 6.15 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.