మంచి నీళ్లు కావాలంటే మాతో ‘సెక్స్’ చేయాల్సిందే.. గర్భిణులను కూడా వదలని..!

దిశ, వెబ్‌డెస్క్ : ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని మధ్యధరా సముద్రం గుండా ఇతర దేశాలకు వలస వెళ్లే శరణార్థులకు లిబియన్ కోస్ట్ గార్డ్స్, అక్కడి నిర్భంద శిబిరాల్లోని ఆర్మీ నరకం చూపిస్తున్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి ఆర్థిక సాయం పొందుతున్న లిబియా కోస్ట్ గార్డ్స్ ఈయూ(EU) దేశాలకు శరణార్థులు రాకుండా సముద్రం మధ్యలోనే వారిని అడ్డగించి లిబియాకు తరలిస్తున్నారు. అలా బలవంతంగా తీసుకెళ్లిన వారిని నిర్భంద శిబిరాల్లో ఉంచి వారిపై పైశాచికత్వం ప్రదర్శించారు. తినడానికి తిండి, మంచి […]

Update: 2021-07-16 02:00 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని మధ్యధరా సముద్రం గుండా ఇతర దేశాలకు వలస వెళ్లే శరణార్థులకు లిబియన్ కోస్ట్ గార్డ్స్, అక్కడి నిర్భంద శిబిరాల్లోని ఆర్మీ నరకం చూపిస్తున్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి ఆర్థిక సాయం పొందుతున్న లిబియా కోస్ట్ గార్డ్స్ ఈయూ(EU) దేశాలకు శరణార్థులు రాకుండా సముద్రం మధ్యలోనే వారిని అడ్డగించి లిబియాకు తరలిస్తున్నారు. అలా బలవంతంగా తీసుకెళ్లిన వారిని నిర్భంద శిబిరాల్లో ఉంచి వారిపై పైశాచికత్వం ప్రదర్శించారు. తినడానికి తిండి, మంచి నీళ్లు ఇవ్వాలంటే.. మాతో ‘సెక్స్’ చేయాలని కండిషన్స్ పెడుతున్నారు. చిన్నారులు, మహిళలు, ఆఖరుకు గర్భిణీ స్త్రీలపై కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయని తాజాగా అమ్నెస్టీ నివేదిక గురువారం వెల్లడించింది.

2020 నుంచి 2021 వరకు మధ్యధరా ప్రాంతంలో అడ్డగించబడిన, లిబియాలో బయలుదేరిన వలసదారులపై దృష్టి సారించిన ఈ నివేదిక.. ఇటీవల లిబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నియంత్రణలో ఉంచినప్పటికీ శిబిరాల్లో పరిస్థితులు మరింత దిగజారిపోతున్నాయని సూచించాయి. దీనిపై స్పందించిన ‘‘పోప్ ఫ్రాన్సిస్ మరియు ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్’’ ఈ శిబిరాలను మూసివేయాలని పిలుపునిచ్చారు.

ముఖ్యంగా నైజీరియా, సోమాలియా మరియు సిరియా వంటి దేశాల్లో ఉన్న కడు పేదరికం, అంతర్యుద్ధాల కారణంగా అక్కడి ప్రజలు పొట్ట చేతబట్టుకుని సముద్ర, రోడ్డు మార్గంలో ఇతర దేశాలకు వలస వెళ్తుంటారు. వీరిని లిబియన్ ఆర్మీ మధ్యలో అడ్డగించి నిర్భంద శిభిరాలకు తరలిస్తున్నట్లు అమ్నెస్టీ స్పష్టంచేసింది. పై మూడు దేశాల నుంచి 14 మరియు 50 సంవత్సరాల మధ్య వయస్సు గల 53 మంది శరణార్థులు మరియు వలస దారులను ఇంటర్వ్యూ చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

శిబిరాల్లో ఉన్న వారితో క్యాంప్ గార్డులు అసభ్యంగా ప్రవర్తిస్తారని ‘‘మీకు మంచినీరు మరియు పడకలు కావాలి అంటే.. నేను మీతో శృంగారం చేయాలి.. అలా అయితేనే నేను నిన్ను విడిపించగలను’’ అని చెబుతారని ఒక మహిళ అమ్నెస్టీతో వాపోయింది. చాలా మందిలో ఒకరు అత్యాచారం గురయ్యారని, మహిళలు శృంగారం చేసేలా బలవంతం చేశారని.. అలా చేస్తేనే వారికి శుభ్రమైన నీరు లభిస్తుందని అమ్నెస్టీ తన నివేదికలో పేర్కొంది.

గర్భిణీ స్త్రీలు కూడా తమపై పదే పదే గార్డ్స్‌ అత్యాచారం చేశారని అమ్నెస్టీకి చెప్పారు. పురుషులు తమను అవమానించే ప్రయత్నంలో భాగంగా లోదుస్తులు మాత్రమే ధరిస్తారని.. అబ్బాయిలతో సహా మరికొందరు తమను హింసించారని తెలిపారు. శరణార్థులను అమానవీయంగా కొట్టడం, హింసించడం మరియు పారిశుధ్య నీరు మరియు ఆహారం ఇవ్వకపోవడం వంటి దుశ్చర్యలను 2017 నుండి పలు బహుళ నివేదికలు బయటపెట్టాయి.

కాగా, యూరోపియన్ యూనియన్ ఇచ్చే నిధులతో లిబియా కోస్ట్ గార్డులు సముద్రంలోనే అడ్డగించి, ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 15 వేల మందిని వారి శిబిరాలకు తరలించారు. అయితే, కొంతమంది EU చట్టసభ సభ్యులు లిబియా కోస్ట్ గార్డులకు నిధులు ఇవ్వడం మానేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా, లిబియా అనేది వలసదారులకు ‘‘సురక్షితమైన ప్రదేశం’’ కాదని వాదిస్తున్నారు.

ఇవీ కూడా చదవండి:

ఇంట్లో కూడా బ్రా, అండర్ వేర్ ధరించాలా?.. నెటిజన్ కు నటి ఘాటు రిప్లై

చనిపోయిన వారి అవశేషాలతో ఆ మహిళ చేసిన పని చూస్తే..

Tags:    

Similar News