ఈటలను సస్పెండ్ చేయండి.. మంత్రులు, ఎమ్మెల్యే లేఖ
దిశ, తెలంగాణ బ్యూరో : మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌ను కోరారు. ఈ మేరకు మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్రణాళికా సంఘం వైస్చైర్మన్బోయినపల్లి వినోద్‌కుమార్, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్… పార్టీ అధినేత కేసీఆర్‌కు లేఖ రాశారు. మంగళవారం వేర్వేరుగా ఈ లేఖలను పంపినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఈటలపై విమర్శలు ఎక్కు పెట్టారు. మంత్రులతో పాటుగా వినోద్కుమార్వంటి నేతల […]
దిశ, తెలంగాణ బ్యూరో : మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌ను కోరారు. ఈ మేరకు మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్రణాళికా సంఘం వైస్చైర్మన్బోయినపల్లి వినోద్‌కుమార్, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్… పార్టీ అధినేత కేసీఆర్‌కు లేఖ రాశారు. మంగళవారం వేర్వేరుగా ఈ లేఖలను పంపినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఇప్పటికే ఈటలపై విమర్శలు ఎక్కు పెట్టారు. మంత్రులతో పాటుగా వినోద్కుమార్వంటి నేతల నుంచి ఈటలకు ఎదురుదాడి మొదలైంది. అటు ఈటల కూడా విమర్శలకు దిగుతున్నారు. అయితే ఈటలకు మద్దతుగా ఎమ్మెల్యే రసమయి ఉంటాడని ఒక దశలో ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఈ ప్రచారం ఉత్తిదేనని తేలిపోయింది. కారణాలేమైనా ఈటలను టీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించాలని, వెంటనే సస్పెండ్ చేసేందుకు నిర్ణయం తీసుకోవాలని పార్టీ చీఫ్ కేసీఆర్‌తో పాటుగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కూడా లేఖను పంపించినట్లు తెలుస్తోంది.
ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసినా ఇంకా పార్టీనుంచి సస్పెండ్ చేసే అంశంలో క్లారిటీ లేదు. అటు రాజీనామాకు కూడా సిద్ధమని ఈటల ప్రకటించారు. పార్టీ గుర్తుపై కాకుండా సొంతంగా మళ్లీ పోటీ చేసేందుకు సిద్ధమేనంటూ సంకేతాలిచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈటలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలు, ప్రజాప్రతినిధులు లేఖ రాయడం చర్చగా మారింది.