కొవిడ్ మరణాలపై ఆడిట్ చేయాలని సీఎం కేసీఆర్‌కు లేఖ

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో కరోనా కారణంగా మృతిచెందిన వారిని గుర్తించి, మృతుల వివరాలపై ఆడిట్ నిర్వహించాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. మరణానికి గల కారణాలను పేర్కొంటూ మరణ ధృవీకరణ పత్రాలను జారీ చేయాలని శ్రవణ్ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. కరోనాతో మరణిస్తే.. వారికి రూ.50 వేల పరిహారం ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, కరోనా కారణంగా అనాథలైన వారికి ఆర్థిక సహాయం అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ […]

Update: 2021-09-27 08:58 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో కరోనా కారణంగా మృతిచెందిన వారిని గుర్తించి, మృతుల వివరాలపై ఆడిట్ నిర్వహించాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. మరణానికి గల కారణాలను పేర్కొంటూ మరణ ధృవీకరణ పత్రాలను జారీ చేయాలని శ్రవణ్ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. కరోనాతో మరణిస్తే.. వారికి రూ.50 వేల పరిహారం ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, కరోనా కారణంగా అనాథలైన వారికి ఆర్థిక సహాయం అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ విధి అని ఆయన రాసిన లేఖలో పేర్కొన్నారు. అయితే కేంద్రం ప్రకటించిన రూ.50వేలు తక్కువే అని కాంగ్రెస్ భావిస్తోందని, రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News