డిగ్రీ క్లాసెస్ @ ఆన్‌లైన్

దిశ, ఆదిలాబాద్: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) కట్టడికి విధించిన లాక్ డౌన్ వల్ల మూతబడిన డిగ్రీ తరగతులు ఎట్టకేలకు మొదలయ్యాయి. పరీక్ష‌లు సమీపిస్తున్న సమయంలోనే నెల రోజుల ముందు కరోనా ప్రభావం‌తో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో తరగతుల పాఠ్యాంశాల బోధన మరుగునపడింది. అన్ని కాలేజీలు మూసివేశారు. దీంతో ఆయా సబ్జెక్టుల సిలబస్ పూర్తికాలేదు. పరీక్షలు దగ్గరపడుతుండటంతో విద్యార్థులలో ఆందోళన మొదలైంది. సిలబస్ పూర్తి కాకుండా పరీక్షలు ఎలా రాయాలన్న ఆందోళన విద్యార్థుల్లో ఉండగా పరీక్షల […]

Update: 2020-04-16 08:11 GMT

దిశ, ఆదిలాబాద్: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) కట్టడికి విధించిన లాక్ డౌన్ వల్ల మూతబడిన డిగ్రీ తరగతులు ఎట్టకేలకు మొదలయ్యాయి. పరీక్ష‌లు సమీపిస్తున్న సమయంలోనే నెల రోజుల ముందు కరోనా ప్రభావం‌తో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో తరగతుల పాఠ్యాంశాల బోధన మరుగునపడింది. అన్ని కాలేజీలు మూసివేశారు. దీంతో ఆయా సబ్జెక్టుల సిలబస్ పూర్తికాలేదు. పరీక్షలు దగ్గరపడుతుండటంతో విద్యార్థులలో ఆందోళన మొదలైంది. సిలబస్ పూర్తి కాకుండా పరీక్షలు ఎలా రాయాలన్న ఆందోళన విద్యార్థుల్లో ఉండగా పరీక్షల నిర్వహణ సహేతుకం కాదని విద్యాశాఖ వర్గాలు భావించాయి. ఇంకా పరీక్షల తేదీలూ ఖరారు కాకపోవడంతో సిలబస్ పూర్తి చేయడం కోసం ఉన్నత విద్యాశాఖ చర్యలు తీసుకుంటున్నది.

కమిషనర్ ఆదేశంతో..

ప్రైవేట్ విద్యాసంస్థలు వివిధ రీతుల్లో విద్యార్థులకు సిలబస్ పూర్తి చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. దీని ప్రభావం ప్రభుత్వ విద్యార్థులపై పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ విద్యార్థులు నష్టపోకుండా ఉండాలన్న ఆలోచనతో ఉన్నత విద్యా శాఖ కమిషనర్ స్థానిక పరిస్థితులను బట్టి ప్రభుత్వ డిగ్రీ విద్యార్థులకు ఆన్‌లైన్ విద్యాబోధన చేయాలని ఆదేశించారు. గ్రామీణ విద్యార్థులకు ఫోన్ ఉన్నట్లయితే గ్రూప్ కాల్ ద్వారా పాఠ్యాంశాలు బోధించాలని సూచించారు. ఈ నెల 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు‌ ఆన్‌లైన్ పాఠ్యాంశాలు ప్రారంభమయ్యాయి. దీంతో ప్రభుత్వ డిగ్రీ విద్యార్థులకు విద్యాసంవత్సరం నష్టపోకుండా అవకాశం కలిగిందని విద్యార్థులు తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.

రెండు యాప్‌ల ద్వారా..

ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థులకు ఆన్‌లైన్ విద్యాబోధనకు ఉన్నత విద్యాశాఖ చర్యలు తీసుకుంటున్నది. ఈ నెల 16వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు బోధించనున్నారు. జూమ్, వెబె‌క్స్ అనే సాఫ్ట్ వేర్ యాప్ ద్వారా విద్యా బోధన చేయనున్నారు.అధ్యాపకులు తమ నిర్ణీత డిగ్రీ కాలేజీల నుంచి ఆయా సెక్షన్ల విద్యార్థులను టీవీ స్క్రీన్‌పై గ్రూపులుగా తయారు చేసి పాఠ్యాంశాలను బోధిస్తారు. ఆన్‌లైన్ లోనే విద్యార్థుల అనుమానాలను కూడా నివృత్తి చేస్తారు. నెలరోజుల వ్యవధిలో అన్ని సబ్జెక్టుల సిలబస్‌ను పూర్తి చేసి విద్యార్థులను వార్షిక పరీక్షలకు సిద్ధం చేస్తామని నిర్మల్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ భీమారావు తెలిపారు.

విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు.

కరోనా ప్రభావంతో డిగ్రీ విద్యార్థులకు ఆన్ లైన్‌లో తరగతులు బోధించాలని ఉన్నత విద్యా శాఖ కమిషనర్ నుంచి బుధవారం ఉత్తర్వులు వచ్చాయి. మా కాలేజీలో ఉన్న విద్యార్థుల వారి తల్లిదండ్రుల సెల్‌ఫోన్ నెంబర్ల ఆధారంగా ఆన్ లైన్‌లో పాఠ్యాంశాలను బోధిస్తున్నాం. విద్యార్థులు కూడా ఆన్‌లైన్ బోధన పట్ల ఆసక్తిని చూపుతున్నారు. నెల రోజుల వ్యవధిలో సిలబస్ పూర్తి చేస్తామన్న నమ్మకం ఉన్నది. – పి.జి.రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, నిర్మల్

Tags: Online Lessons, Govt Degree college students, syllabus completion, professors

Tags:    

Similar News