రాజేంద్రనగర్‌లో చిరుత సంచారం..!

దిశ, రంగారెడ్డి: రాజేంద్రనగర్‌లో చిరుత సంచారం మరోసారి కలకలం సృష్టించింది. ఇక్కడి జాతీయ వ్యవసాయ పరిశోధనా విస్తరణ సంస్థ(మేనేజ్‌) సమీపంలోని ట్యాంక్‌ ఏరియాలో ఏర్పాటు చేసిన సీసీటీవీలో చిరుత సంచరించిన ఆనవాళ్లు రికార్డు అయ్యాయి. అక్కడికి దగ్గరలోనే గ్రేహౌండ్స్‌ పోలీసుల శిక్షణా కేంద్రం ఉండటంతో పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఓ సీసీటీవీలో గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో చిరుత అక్కడి నిర్మానుష్య ప్రాంతంలో సంచరించినట్లు అధికారులు గుర్తించారు. ఈ నెల 14న […]

Update: 2020-05-28 22:28 GMT

దిశ, రంగారెడ్డి: రాజేంద్రనగర్‌లో చిరుత సంచారం మరోసారి కలకలం సృష్టించింది. ఇక్కడి జాతీయ వ్యవసాయ పరిశోధనా విస్తరణ సంస్థ(మేనేజ్‌) సమీపంలోని ట్యాంక్‌ ఏరియాలో ఏర్పాటు చేసిన సీసీటీవీలో చిరుత సంచరించిన ఆనవాళ్లు రికార్డు అయ్యాయి. అక్కడికి దగ్గరలోనే గ్రేహౌండ్స్‌ పోలీసుల శిక్షణా కేంద్రం ఉండటంతో పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఓ సీసీటీవీలో గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో చిరుత అక్కడి నిర్మానుష్య ప్రాంతంలో సంచరించినట్లు అధికారులు గుర్తించారు. ఈ నెల 14న గగన్‌పహాడ్‌ సమీపంలో చిరుత సుమారు మూడు గంటలు సంచరించింది. అటవీశాఖ అధికారులు, పోలీసులు తీవ్రంగా శ్రమించినా ఆచూకీ కనుక్కోలేకపోయారు. ఓ స్థానికుడు హిమాయత్‌సాగర్‌లో నీరు తాగుతుండగా చూసినట్లు అధికారులకు చెప్పడంతో అక్కడా గాలించారు. గురువారం చిరుత సంచరించినట్లు సీసీటీవీలో రికార్డ్‌ కావడంతో ఆయా సంస్థల అధికారులు అప్రమత్తమయ్యారు.

Tags:    

Similar News