‘కేసీఆర్ అహంకారానికి ఇదే నిదర్శనం’
దిశప్రతినిధి, వరంగల్: ఉద్యోగాల భర్తీ లెక్కల్లో అధికార టీఆర్ ఎస్ పార్టీ పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తోందని వామపక్షాల ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారథిరెడ్డి ఆరోపించారు. గతంలో ఉద్యోగాల్లో కొనసాగుతూ రెగ్యులరైజ్ చేయబడ్డ ఉద్యోగులను కూడా భర్తీ చేసిన లెక్కల్లో చూపి ప్రజలను మోసం చేయాలని చూస్తోందన్నారు. సీఎం కేసీఆర్ నోటికి ఎంతవస్తే అంత మాట్లాడుతున్నారని అన్నారు. ఓట్లేసి ప్రజలను తొక్కుతానని, కుక్కలంటూ మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్ అహంకారానికి ఇది నిదర్శనమని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు ఓట్లతో […]
దిశప్రతినిధి, వరంగల్: ఉద్యోగాల భర్తీ లెక్కల్లో అధికార టీఆర్ ఎస్ పార్టీ పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తోందని వామపక్షాల ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారథిరెడ్డి ఆరోపించారు. గతంలో ఉద్యోగాల్లో కొనసాగుతూ రెగ్యులరైజ్ చేయబడ్డ ఉద్యోగులను కూడా భర్తీ చేసిన లెక్కల్లో చూపి ప్రజలను మోసం చేయాలని చూస్తోందన్నారు. సీఎం కేసీఆర్ నోటికి ఎంతవస్తే అంత మాట్లాడుతున్నారని అన్నారు. ఓట్లేసి ప్రజలను తొక్కుతానని, కుక్కలంటూ మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్ అహంకారానికి ఇది నిదర్శనమని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు ఓట్లతో తొక్కేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. గురువారం హన్మకొండ ప్రెస్‌క్లబ్ నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో జయసారథి పాల్గొని, మాట్లాడుతూ… ప్రభుత్వం విద్యావంతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలం చెందిందన్నారు. ఒక్క యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ లేడని అన్నారు. ఓరుగల్లులాంటి చారిత్రక నగరాన్ని ఏడేళ్ల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. వామపక్షాల ఉద్యమాలతో తన కుటుంబ సభ్యులు మమేకమై ఉన్నారని గుర్తు చేసుకున్నారు. జర్నలిస్టుగా తనకు అనేక విషయాలపై అవగాహన ఉందని, కలంతో పోరాడిన తాను.. ఇప్పుడు జనం సమస్యలపై రాజకీయాల్లో పోరాడటానికి సిద్ధమైనట్లు పేర్కొన్నారు.