ఓ చిరుత నీవెక్కడ..!
దిశ, రంగారెడ్డి: దారి తప్పి వచ్చిందో లేక ఆకలి భరించలేక వచ్చిందో తెలియదు కాని, ఓ చిరుత జనారణ్యంలోకి వచ్చి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. చిక్కినట్టే చిక్కి తప్పించుకుంది. చిరుత కోసం పోలీసులు, అటవీ అధికారులు వెతకని చోటంటూ లేదు. 24 గంటలు గడిచినా చిరుత జాడ దొరకలేదు. దీంతో పోలీసులకు చిరుతను కనిపెట్టడం సవాల్‌గా మారింది. వివరాలు ఇలా.. హైదరాబాద్ నగర శివారులోని మైలార్‌దేవ్‌పల్లి సమీపంలోని కాటేదాన్ అండర్ బ్రిడ్జి రోడ్డుపై గురువారం […]
దిశ, రంగారెడ్డి: దారి తప్పి వచ్చిందో లేక ఆకలి భరించలేక వచ్చిందో తెలియదు కాని, ఓ చిరుత జనారణ్యంలోకి వచ్చి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. చిక్కినట్టే చిక్కి తప్పించుకుంది. చిరుత కోసం పోలీసులు, అటవీ అధికారులు వెతకని చోటంటూ లేదు. 24 గంటలు గడిచినా చిరుత జాడ దొరకలేదు. దీంతో పోలీసులకు చిరుతను కనిపెట్టడం సవాల్‌గా మారింది. వివరాలు ఇలా.. హైదరాబాద్ నగర శివారులోని మైలార్‌దేవ్‌పల్లి సమీపంలోని కాటేదాన్ అండర్ బ్రిడ్జి రోడ్డుపై గురువారం ఓ చిరుత హఠాత్తుగా ప్రత్యక్షమైంది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందారు. చిరుతను బంధించేందుకు అధికారులు ప్రయత్నించగా తప్పించుకుని ఓ ఫంక్షన్ హాల్‌లోకి.. అటు నుంచి 40 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి చిరుత జాడ కోసం అధికారులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. వ్యవసాయ క్షేత్రంలోని పొదల్లో చిరుత నక్కి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. చిరుతను గుర్తించేందుకు 25 సీసీ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. చివరకు ఎరగా రెండు మేకల ఉంచి బోన్‌లు కూడా ఏర్పాటు చేశారు. అయినా చిరుత జాడ దొరకలేదు. మరోపక్క చిరుత ఎక్కడ దాడి చేస్తుందేమోనని బద్వేలు, నేతాజీనగర్ వాసులు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. వ్యవసాయ క్షేత్రంతో పాటు రాజేంద్రనగర్ వర్సిటీ అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టినట్టు శంషాబాద్ సీపీ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు.