రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం.. కేసీఆర్ ఫ్లెక్సీతో దీక్షకు దిగిన ప్రజా ప్రతినిధులు
దిశ, స్టేషన్ ఘన్ పూర్: 15 ఏళ్ళ కింద రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదాన్ని సరిచేసి మూడు వేల మంది రైతులకు న్యాయం చేకూర్చాలని డిమాండ్ జనగామ జిల్లా జఫర్గడ్ మండల పరిషత్తులో చేపట్టిన నిరసన దీక్ష రెండో రోజుకు చేరింది. బుధవారం మధ్యాహ్నం సర్వసభ్య సమావేశంలో ప్రారంభమైన నిరసన దీక్ష ప్రస్తుతం కొనసాగుతూనే ఉంది. రాత్రి మండల పరిషత్ కార్యాలయంలో దీక్షా శిబిరంలో నిద్రించిన ప్రజా ప్రతినిధులు గురువారం తెల్లవారుజాము నుంచి తిరిగి దీక్షను కొనసాగిస్తున్నారు. […]
దిశ, స్టేషన్ ఘన్ పూర్: 15 ఏళ్ళ కింద రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదాన్ని సరిచేసి మూడు వేల మంది రైతులకు న్యాయం చేకూర్చాలని డిమాండ్ జనగామ జిల్లా జఫర్గడ్ మండల పరిషత్తులో చేపట్టిన నిరసన దీక్ష రెండో రోజుకు చేరింది. బుధవారం మధ్యాహ్నం సర్వసభ్య సమావేశంలో ప్రారంభమైన నిరసన దీక్ష ప్రస్తుతం కొనసాగుతూనే ఉంది. రాత్రి మండల పరిషత్ కార్యాలయంలో దీక్షా శిబిరంలో నిద్రించిన ప్రజా ప్రతినిధులు గురువారం తెల్లవారుజాము నుంచి తిరిగి దీక్షను కొనసాగిస్తున్నారు.
తొమ్మిది గ్రామాల రైతుల తిప్పలు..
2016లో అప్పటి రెవెన్యూ అధికారి తప్పిదానికి తొమ్మిది గ్రామాలకు చెందిన రైతులు అవస్థలు పడుతున్నారు. రైతుల పట్టా భూములు అసైన్డ్ భూములుగా రికార్డుల్లో చేర్చారు. దీనితో మండలంలోని ఉప్పుగల్లు, తమ్మడపల్లి, తిమ్మాపురం, తీగారం, సాగరం, షా పల్లి, జఫర్గడ్, హిమాయత్ నగర్, కోనాయచలం గ్రామాలకు చెందిన రైతులు తహశీల్దార్ కార్యాలయం, ఆర్ డీ ఓ, కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగిన సమస్యకు పరిష్కారం చూపలేదు. 900 సర్వే నంబర్లు, 5106 ఎకరాలు, 9 గ్రామాలలో 900 సర్వే నంబర్లుకు చెందిన 5106, 16 ఎకరాల వ్యవసాయ భూములు మొత్తం అసైన్డ్ భూములుగా మారిపోయాయి. దాని ఫలితంగా గత 15 సంవత్సరాలుగా భూ యజమానులు తమ అవసరాల కోసం భూములను అమ్మేందుకు, కొనేందుకు వీలు లేకుండా పోయింది. ధరణి పోర్టల్లో( పీఓపీ) నిషేధిత జాబితాల్లో చేర్చడంతో స్లాట్ బుకింగ్ కాక అటు అమ్మలేక ఇటు పనులు లేక రైతులు అవస్థలు పడుతున్నారు.
పట్టించుకోని అధికారులు..
గత 15 ఏళ్లుగా స్థానిక అధికారుల నిర్లక్ష్యంతో జరిగిన పొరపాటును సరిచేసి మాకు న్యాయం చేకూర్చాలని కొత్తగా వచ్చిన తహసీల్దార్లు, ఆర్డీవోలు, కలెక్టర్‌ల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా రికార్డులు మారలేదు. తొమ్మిది గ్రామాల రైతాంగ సమస్యకు పరిష్కారం దొరకలేదు. రైతుల ద్వారా విషయం తెలుసుకున్న అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు ప్రత్యక్ష పోరాటానికి దిగారు. మండలంలోని సమస్యలను చర్చించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన ప్రతినిధులు రైతుల పక్షాన నిలిచారు. అసైన్డ్ గా మారిన భూములను పట్టా భూములుగా మార్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని అల్టిమేటం జారీ చేశారు. ఏపీ ఎంపీపీ రడపాక సుదర్శన్, జెడ్ పీటీసీ ఇల్లందుల బేబీ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ కడారి కనకయ్య, సొసైటీ చైర్మన్ కర్ణాకర్, కో ఆప్షన్ సభ్యుడు నజీర్ తో పాటు సర్పంచులు ఎంపీటీసీలు ఆందోళనలో పాల్గొన్నారు.