పీఆర్సీ బకాయిలు వెంటనే విడుదల చేయాలి
దిశ ప్రతినిధి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు జూలై 2018 నుంచి రావల్సిన పీఆర్సీని వెంటనే విడుదల చేయాలని తెలంగాణ స్టేట్ మైనార్టీ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ (టీఎస్ మెసా) ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు టీఎస్ మెసా అధ్యక్షుడు ఫారూఖ్ అహ్మద్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ… అంతేగాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 ఏండ్లకు పెంచాలని కోరారు. రాష్ట్రంలో పని చేసే ఉద్యోగులందరికీ ఒకే విధమైన హెచ్ఆర్ఏ […]
దిశ ప్రతినిధి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు జూలై 2018 నుంచి రావల్సిన పీఆర్సీని వెంటనే విడుదల చేయాలని తెలంగాణ స్టేట్ మైనార్టీ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ (టీఎస్ మెసా) ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు టీఎస్ మెసా అధ్యక్షుడు ఫారూఖ్ అహ్మద్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ… అంతేగాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 ఏండ్లకు పెంచాలని కోరారు.
రాష్ట్రంలో పని చేసే ఉద్యోగులందరికీ ఒకే విధమైన హెచ్ఆర్ఏ వర్తింపజేయాలని, మైనార్టీ ఉద్యోగులకు రిజర్వేషన్లు కల్పించాలని, పదోన్నతులతో పాటు మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ సెలవులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఇవ్వాలని, మైనార్టీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు స్థలం కేటాయించాలనే డిమాండ్లతో గత నెలలో సీఎం కేసీఆర్‌కు వినతిపత్రం అందజేశామన్నారు.